పుట:కాశీమజిలీకథలు -07.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

కాశీమజిలీకథలు - సప్తమభాగము

జూచి యానందించెందంగాక యని తలంచి యొక మార్గంబునంబడి నడువసాగెను కుసుమఫలదళ మనోహరములగు తరులతా విశేషములచే నవ్వన మతనికిఁ గన్నుల పండువ గావించినది పలురకములగు పూ వులతావి యాఘ్రాణించుచు మెచ్చుకొనుచు వింత పండ్లం జూచి యచ్చెరువందుచుఁ గొంత సేపందు విహరించి పోయి పోయి సీతామహాదేవి వసించిన శింశుపావృక్షమును గనుంగొనియెను.

అది మిక్కిలి ప్రాతదై యున్నది. విభీషణుఁడు శ్రీరామనందుగల భక్తివిశేషమునంజేసి సీతామహాదేవి కాశ్రయభూతమైన యా వృక్షరాజమును శిధిలము గాకుండ దోహదముల గావింపుచు లనేకవిచిత్రాలంకారముచే వెయింపఁజేసెను. తన్మూలమున నవరత్నములచే వేదిక గట్టించెను. శాఖోపశాఖలును కుసుమకిసలయ ఫలదళములును కృత్రిమముగఁ గనకరత్న విశేషములచేఁ బ్రకాశింవ జేయుచుండెను. ఆవేదికయందు వేనవేలు రాక్షసవృద్దులు వసించు వేదశాస్త్రపురాణములఁ బఠింపుచుండిరి. కొందరు మూలమున స్థాపించియున్న కాంచన సీతావిగ్రహమును నామెతో సంభాషించు చున్నట్లు నిలుపఁబడినహనుమద్విగ్రహమును సహస్రనామములచేఁ బూజించుచుండిరి.

పెక్కేల రావణుఁడా నాఁడు గావించిన చర్యలెల్ల నందుఁ గల ప్రతిమల జూచినఁ పురాజము జెప్పినట్లు తెల్లముగాక మానదు.

అట్టి విశేషములం జూచుచుఁ పరమానంద భరితుండై కరవాలము కేలం గీలించి మణిధారణంబున నొరులకుఁ గనంబడక యవ్వన మంతయుఁ తిఱిగి తిరిగి ఫలములం దిని యాకలి యడంచుకొనియెదను. రత్న ప్రభావంబునఁ దనకు క్షుత్పిపాసలు లేవని తెలిసియును రుచి జూడ ఫలముల నారగింపుచుండెను.

అందఁగల రాక్షసులెల్ల వికృతిరూపములచే నొప్పుచున్నను వారి చేష్టలు క్రూరములు కావు బ్రహ్మఘోషము చేయుచుందురు. సామగానంబులుచ్చరించు చుందురు శిష్యులచే వల్లె నేయించుచుందురు అందొకచో నీదారినెవ్వరు రాఁగూడదు. రాజపుత్రిక చంపక విహరించు నుద్యానవనమున కీదారి పోవును అని యున్న ప్రకటనం జూచి యతండు మిక్కిలి నంతసించుచు నాదారింబడి పోయెను కొంతదూరము యేగువరకు నొక పూవు దోట నతనికిఁ గన్నులపండువు గావించినది. దానింజూచి యతండు ఔరా! నావంటి పుణ్యాత్ముం డెందునులేడు. మున్ను రావణుఁడు దిక్పాలుర నగరములోనుండు మంచివస్తువులనెల్ల నేరితెచ్చి లంకలో నుంచుకొనెనని పురాణములు చెప్పుచున్నవిగదా? వానింజూచిన మనుష్యుఁడులేడు నాకు స్వప్నమో యింద్రజాలమో తెలియదు యిట్టికేళీవనము చూచుటకు నాకీ రెండుకన్నుల జాలవు.

ఓహోహో! ఈపరిమళము భూలోకము లోనిదియా? మేను పరవశమగు