పుట:కాశీమజిలీకథలు -07.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

కాశీమజిలీకథలు - సప్తమభాగము

గోముఖి - యీచిన్న విభీషణుండు తాతక౦టెఁ గ్రూరకర్ముడుగదా ! మనకు మద్యమాంసము లిచ్చినచో లొంగమనియే అల్పాహారము లిచ్చి బద్దులంజేసి మాడ్చు చున్నాడు.

అనాసిక - పది యేనుఁగుల భక్షింపగల్గిన మనకీ స్వల్పాహారమే మూలకు వచ్చెడిని.

గోముఖి - పోనీ చచ్చినట్లు పడియుందమన్నను యీతులసీ మాలికల త్రిప్పుటయు నోరు నొప్పి పెట్టునట్లు శత్రునామము జపించునట్లు విధించెనే? మరియు దినమునకు లక్ష తక్కువగాకుండ జపి౦పవలయునఁట. ఆకలిబాదన వేగుదుండ నీ నామము లెట్లుసాగెడివి.

దీర్ఘ నాసిక -- పూర్వము ప్రహ్లాదుని రాజ్యకాలములో రాక్షసులనెల్ల నారాయణమంత్రము జపింపుడని నిర్భంధించినట్లు మాయమ్మమ్మతల్లి చెప్పెడిది ఆవెత మనకిప్పుడు గలిగినది.

లంబోదరి - అదిగో ; రాజభటులిటులవచ్చుచున్నారు. మాలికలబూని జపము సేయుడు, ఛీ రామ ఛీ రామ (అని అందురు జపించు చున్నారు.)

రాజభటులు - (ప్రవేశించి) రండలారా? జపములు మాని మాటలాడుకొను చుండిరా ! మేము చూచితిమిలెండి లంబోదరీ ! నీవిప్పట్టికెన్ని జపించితివో చెప్పుము.

లంబోదరి - ఏబదివేలు జపించితిని.

రాజు - ఛీ రండా? రెండుగడియలప్రొద్దెక్కినదో లేదో యే బదివే లెట్టుజపించితివి. నీలెక్క తప్పులెక్క నిన్ను శిక్షింపుఁడు జేసెదము చూడుము.

లంబోదరి - పొరపాటు చెప్పితిని రక్షింపుఁడు రెండువేలెనని ఇవిగో గీటులు చూడుఁడు.

రాజభటులు - అసి ముండా! ఎలా బొంకితివి ఇందులకు శిక్షనేఁడు అధికముగా రెండులక్షలు రామనామము జపింపుము. లేనిచో మహారాజుగారికి దెలియఁ జేసెదము.

లంబో - చిత్తము చిత్తము సీరామసీరామ అని వడిగా జపించుచున్నది.

రాజభటు లందరిని నట్లే ------- దాపునఁ గూర్చుండి శ్రీ రామనామజపము చేయింపుచుండిరి. మహామునులవలెఁ -----మూసికొని యారాక్షసస్త్రీలందఱు నొకరి వంక నొకరుచూడక తారక మంత్రము జపించుచుండిరి.

అట్టి సమయమున దీర్ఘ నాసికలేచి తావి యాఘ్రాణించి హాయి హాయి మానిసి వాసన యెన్నిదినములకు నాశాపక్వమైనది. అనుటయు అవునవును మనుష్యవాసనయే.