పుట:కాశీమజిలీకథలు -07.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వికరములతో నెగురుచుండెను. అంతలోఁ జంద్రోదయమైనది. కౌముదీసమయంబు వెండిపూసినట్లు చదల నాక్రమించినది. అప్పుడు తరగలం బొడమిన తుంపరల నెగరఁజిమ్ముచుఁ బిల్లవాయువులు మాకెంతేని హాయిగావించినవి. వీచికల రాచికొని యోడలవలె జలధి మీదుగానరుగుచున్న విమానములపైఁ గూర్చుండి చల్లగాలి సేవింపుచు మేమయ్యంబునిధి విశేషంబులఁ దిలకింపుచుంటిమి. మఱియును

సీ. క్రిందిభాగము మహోర్మికలు బొంగుచుముంస
          నలరి నంబు క్రీడ లాడియాడి
    త్రుళ్ళి చింత్రాంబుజంతువులు యానముల పై
          బడినఁ జేతులునాచిపట్టిపట్టి
    మించువీచులగ్రుమ్మరించిన వృధుశుక్తి
          రాసిలో ముత్తెముల్ దీసితీసి
    పవడంబుతీవ గన్పడినయప్పుడ యాఁగి
         గ్రుచ్చి ఖండములుగాఁగోసి కోసి

గీ. మ్రోలఁబాఠీన లుంఠనంబులను గనుచు
    జలవిహంగమరుత విశేషముల వినుచు
    నతులితానంద మనుభవించితిమి మేము
    కడలిమీదుగ నేగునప్పుడు లతాంగి.

అనేకవినోదములఁజూచుచు మేమాసముద్రము మీఁదుఁగాబోవు చుండఁ గొండొకవడికి దత్తీరంబున సమున్నతసౌధాగ్ర సమల్లిఖితగోపురంబగు నీ పురంబు గన్నుల పండువు గావించినది. ఇన్నగర ప్రాసాదవిశేషంబు లింద్రయమనరుణ కుబేరపట్టణ సౌధప్రభల మించి యున్నట్లు తోచుటనుఁ దర్వికవ దర్శనలాలసులై వస్తువుల సమానవేగముగల తమ విమానముల ----------- గగనమునకు రివ్వున నెగరఁజేసి తదుపరిభాగంబునం నిలచి

మ. అదెశృంగాటకమందు నాల్గుమొగలన్ హర్మ్యోత్తమంబుల్ ప్రభా
     స్పదముల్ రాజిలు రాజమార్గమదె భాస్వత్సోధరాజీయుతం
     బదె సాలంబదె రాజమందిరము కల్యాణోత్సవోపేత మ
     య్యదియే తోరణమౌర! వీటిరుచి పెంపౌఁగౌముదీవ్యాప్తి చెన్.

అని అనేక ప్రకారంబులం నిప్పుటభేదన విశేషంబులం గొనియాడు చుండి రట్టితరినావల్లభుండు మదంస భాగంబు గరతలంబునం గొట్టుచు బోఁటీ! అటు