పుట:కాశీమజిలీకథలు -07.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

కాశీమజిలీకథలు - సప్తమభాగము

సాలియై విజృంభించి యధాకాలమున నుపాధ్యాయులవలన విద్యల నభ్యసించుచు అచిరకాలములో అఖండకళానిపుణుండై విరాజిల్లెను.

హేమప్రభయు మంత్రులు గావించు రాజతంత్రముల స్వయముగా విమర్శించుచు మంచి చెడ్డల నిరూపించి ధర్మలోవము గాకుండఁ బూర్వఖ్యాతి సెడకుండఁ బ్రకృతిజనంబులు స్తుతియించునట్లు రాజ్యంబు గావింపుచు రాజద౦పతుల భూమండల మంతయు వెదకి తీసికొని వచ్చునట్లు గొప్ప ప్రయత్నము గావింపుచుండెను.

అచ్చేడియ యొకనాఁడు ప్రతిప దాయత్తచిత్తయై ధ్యానించుచుండ మంత్రులెద్దియో పత్రిక నామెయొద్దకుఁ బంపిరి. విప్పి దానింజదువ నిట్లున్నది.

రాజ్ఞీ ! వీరసింహునకుఁ బితృప్రవాస ప్రకారఁ బేమియు దెలియనీయఁగూడదని నీవు మా కాజ్ఞాపించితివి గదా? నీ యానతి ననుసరించి అట్టివారిం గట్టిగా శిక్షింతుమని మేముప్రకటించి యుంటిమి. తచ్చాసనంబునకు వెరచి యెవ్వరును యువరాజుగారి కత్తెరంగెఱింగించి యుండలేదు. నేఁడొక విదేశభూసురుండు విద్యాలాలసుండగు వీరసింహునింజూడ విద్యాశాలకఱిగి యుపాధ్యాయులు వలదని సంజ్ఞలు సేయుచుండఁ దెలిసికొనలేక మాశాసనము మన్నింపక వీరసింహునితోఁ బ్రసంగించుచు నీక్రింది పద్యములు నుడివెను.

గీ. విక్రమాదిత్యకులరత్న ! విపులయత్న
    తరణిసమతేజ! యర్దిమందారభూజ
    విజయ భానుతనూజ ! యో వీరసింహ !
    స్వస్తియగు నీకు భూలోక సార్వభౌమ.

చ. వనజహితుండు నాఁదగు భవజ్జనకుండు విదేశవాసియై
    చనఁ దిమిరంబు గ్రమ్మికొనెఁ జారులు చోరులు మీరిలోకపీ
    డన మొనరింపఁ దద్వ్యధ లడంచె గదా? మెఱుంగు చెల్వమీ
    జనని హితంబుగోరెడు ప్రజాతతి యింత త్వదాధిపత్యమున్.

గీ. భాస్కరునిరాకఁగోరు నీ ప్రజలు తత్స
    మాన తేజఃప్రదీపుఁడవైన నీ మ
    హోదయస్పూర్తిఁ బరితుష్టి నొందుచుండి
    రవని బాలింపు లోకబాంధవుఁడ వగుచు.

ఆ పద్యములువిని యందు రెండవ పద్యమునందలి అర్థమును విమర్శించి వీరసింహుఁడౌరా ! కదానిమెఱుఁగు చెల్వయన మాతల్లి హేమప్రభయని సూచించు చున్నది. విజయభాస్కరుఁడు మాతండ్రియా ? అతండు ప్రవాసమరిగినట్లు