పుట:కాశీమజిలీకథలు -07.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

కాశీమజిలీకథలు - సప్తమభాగము

గావించితినని సిగ్గుపడుచుండ అతండు గద్గకంఠముతోఁ దల్లీ! నీ సౌశీల్యము లోక విదితమైనది. నీవు విచారింపపలదు. నీ కతంబున మా వంశము వాసి కెక్కి, నది.

క. తలనుండి తృణముదీసిన
   నలరారుం గోటియిచ్చినట్లుల మజనుం
   డిలఁ బ్రాణమిచ్చి యపకృతి
   సలిపిన వైరముగనది యసజ్జనుఁ డెంచున్‌.

నీవు గృతజ్ఞురాలవై మంచికీర్తి సంపాదించితివని పొగడుచుఁ బెద్దగా గౌరవించెను. పదిదినముల దనుక రోహిణియు జితవతియుఁ దమ ప్రయాణవిశేంషంబుల నాప్తుల కెరింగించుచుండిరి. ఆ ప్రస్తావములో రోహిణి ప్రభాకరుని గుణగణంబులను పెద్దగాఁ బొగడుచు నామె మనసు వానియందు లగ్నమగునట్లు కావించినది.

తన నిమిత్తమై యత్తర దేశారణ్యములఁ దిరుగుచు నతండు పడిన కష్టములును జెప్పిన మాటలును జేసిన కృత్యంబు లుగ్గడించిన విని జితవతి అయ్యో? సఖీ! ఆ రాజపుత్రుఁడు నా కొరకంత పరితపింప నేమిటికి? నా మాత్రవు జోగురా లాయనకు దొరకదా ? కటకటా ? నే నెందరిని గష్టపెట్టితినో అని పలికిన విని రోహిణి జితవతి ! ప్రభాకరుఁడు నీ రూపము గుఱించి యంతగా స్తుతిజేయఁడు. నీ కృతజ్ఞతఁ దలఁచి అబ్బా ! వాని మనసు నీరై బోవునుగదా ? అని యానందభాష్పములతో నెరింగించిన జితవతి పలుమారు వినివిని యొక్క నాఁడిట్లనియె.

రోహణి ! నీ యుపన్యాసము శ్రోతవ్యమై యున్నది. నేను జోగురాలనై గుడిలో వసించియతనితో సంభాషించితిని. ఇప్పుడుశృంగార క్రీడలవానిమతినెట్లురంజింపఁజేయఁ గలను. శృంగార వైరాగ్యములు పరస్పర విరోధములుకావా? నా వైరాగ్యమంతయు, గపటమని తలంపఁడా అని యనేక విషయంబులఁ దలఁచి చెప్పిన విని రోహిణిచాలుఁ జాలు. నీ వైరాగ్యమే వానికి హృదయంగమముగా నున్నవఁట. నాఁడు నాతోఁజెప్పిన మాట లెన్నిగలవు ? నీవు మరియొకరీతిఁ దలంప నిందు మీ తలిదండ్రుల యభిలాషయు నట్లే యున్నది. నీ భర్త ప్రభాకరుఁడని వేల్పులే నిశ్చయించిరి. ముహూర్తము నిశ్చయించిరి. నీతో నూరక చెప్పుచున్నాను. కాని యిదివరకే పన్నాగమంతయు, గారవించిరని యెరిగించి యామె యంగీకారము గైకొని యశీనరున కెరగించినది.

ఉశీనరుఁడు ప్రభాకరునిఁ బంధుమిత్ర పరివార సహితముగా రప్పించి శుభ ముహూర్తంబున నత్యంతవైభవముతో జితవతినిచ్చి వివాహము గావించెను. అరుంధతీ మహాదేవి నందినీధేను దుగ్దంబుల స్వయముగాఁ బెరికి జితవతి కిచ్చియున్నది. యా పాల నా రాజపుత్రిక జాగరూకతతోఁ దెచ్చియుంచి వివాహానంతరమున భర్తకిప్పించి