పుట:కాశీమజిలీకథలు -07.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

కాశీమజిలీకథలు - సప్తమభాగము

చెను. ప్రభాసుని దక్క తక్కిన వసువుల జన్మమాత్రముననే ముక్త లగు నట్లనుగ్రహించెను. ప్రభాసుండు పుడమిలో జనింపక తీరదు యోగసక్త మునిపై నలుగుటచే శపురాలైనది. మ్లేచ్ఛజాతియందుఁ బుట్టును. ఇప్పుడు మేమేమి చేయుదుము శాపములు క్రమ్మరింప శక్యముగాదు. నీయభిలాష యేదియో చెప్పుము నీకు సంతోషము గావింప మాకుత్సాహముగా నున్నదని పలికిన విని జతవతి యిట్లనియె.

దేవీ ! యోగసక్త నాకు మనుష్యజన్మ వలనఁ గలిగిన యిక్కట్టు బావఁ బ్రయత్నించి నాకతంబున నావెతలం గుడుచుచుండ నాకు వేరొక పనివలన సంతోష మెట్లు కలుగునో చెప్పుము. నాకుపకారము గావింవఁ బూనినవా రాపద నొందుచుండి నాబ్రతుకేమిటికి, నావైభవము కాల్చనా? తల్లీ! ఆదంపతులశాపము నేననుభవించెద. వారి విముక్తలం గావింప నీపతిం బ్రార్దింపుము. నన్ను మ్లేచ్ఛజాతిగాదు ఛండాల జాతి యందుఁ బుట్టింపుము. పతిపుత్ర శూన్యంజేసి భరింపరాని యిడుములం గుడింపుము. అందులకు వెరవను. నామిత్రులు దుఃఖశూన్యులైనంజాలును. అయ్యో? నా ప్రాణసఖురాలు యోగసక్త మనుష్యులు జరామరణ రోగములవలనంబడు నిడుములు విని మిక్కిలి విచారించినది తానధమజాతియందు జనించి యట్టిబాధలం బొందుదునని వినినప్పుడెంత చింతించెనో తెలియదు. నన్నెంత నిందించెనో? నానేస్తము వలన గలిగిన చిక్కులకు విసుగుకొనక మానునా ? అయ్యో అట్టి యుత్తమురాలిం గష్ట పెట్టితిని నేను జీవచ్చనమునుగానా ? కటకటా ? నాకుపకారము చేయఁబూనినవా రెందఱు చెడిరో చూడుము దివ్యలోకముల భర్త తోగూడ విమానమెక్కి స్వేచ్ఛవిహారములు గావించు యోగసక్త యధోగతిం బొందినది. అంతఃపురముల రాజభోగము లందెడు రోహిణి యేటిపాలైనది. అడవిలో మెకములకెల్ల తాన యొడయఁడై కడుపు నిండ మాంసము గుడుచుచు యధేష్ట విహారముగావించు నీమృగరాజు తిండితినక కుళ్ళిచచ్చినది అమ్మా ! నేను వేషమున కిట్లుంటినిగాని కడుపాపాత్మురాల. నేనుత్తముల శోకాయత్తులం జేయుటకు జనించితిని నేను‌ బుట్టకున్న వీరి కీయిక్కట్టు లేకపోవును గదా ! కావున నాయావుల శాపవిముక్తులం గావిం‌పుము. లేకున్న నిప్పుడే మీపాదమూలమున నాశిరము వ్రయ్యఁజేసి యాదుఃఖము మరచెదనని గోలుగోలున నేడ్చుచుఁ బులితోలు నేలం బెట్టకయే యాదంపతులమ్రోల జాగిలంబడినది.

అప్పుడరుంధతి పతితో మహాత్మా ! ఈసుగుణమణి దుఃఖించిన మనము నాశనము నొందుదుము యిట్టికృతజ్ఞురాలు భూతభవిష్యద్వర్త మాన కాలములయందు మఱి యొకతె లేదని నాయభిప్రాయము. ఈమె నెట్లైన సంతోష పెట్టక తీరదు మన తపంబంతయు ధారపోసియైన‌ నుపకారము చేయవలయునని ప్రార్దించిన విని యమ్మహర్షి