పుట:కాశీమజిలీకథలు -07.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసిష్ఠుని కథ

71

కనుంగొని యాశ్చర్యముతో అరుంధతీమహాదేవి నొసట మడతలుదేర గన్నులెత్తి చూచుచు భర్తతో ప్రాణేశ్వరా! ఈ వచ్చు మచ్చెకంటి యెవ్వతె? యోగినీ వేషము బూనిన శ్రీవిష్ణుని జగన్మోహినీ రూపముగాదుగద? పులితోలు శిరంబున దాల్చినదేమి? ఆహా? జటావల్కలములు ధరించినను అమ్మించుబోణి రూపమా సేచనకంబై యున్నది మునికన్యకల కిట్టి సోయగముండునా? ఈమె యెవ్వతెయో చెప్పుడని యడిగిన విని వసిష్ఠుండు వెరగుపాటుతోఁ జూచుచుండెను.

అంతలో జితవతి వారిదాపునకువచ్చి పులితోలు నేలంబెట్టకయే సాష్టాంగ నమస్కారములు గావించి మహాత్ములారా ! పురాణదంపతులగు మిమ్ముఁ జూచుటచే నేను గృతార్థురాలనైతిని. నాసాపములు పటాపంచలైపోయినవి. మీదర్శనమునకై యెన్నియో వెతలఁబడి యిక్కడికి వచ్చితిని. మిమ్ముజూచితిని నాకోరిక సఫలముగాఁ గలదని పెద్దగాఁ బొగడినది.

అప్పు డరుంధతీ మహాదేవి ఆచ్చిగురుఁబోణిని గ్రుచ్చియెత్తి యాదరించుచు సుందరీ ! నీవెందలిదానవు? నీపేరెయ్యది? మాయొద్దకు రాఁబనియేమి‌? ఈపులితోలు అంత శ్రద్ధగా శిరంబునఁ బూనితివేమిటికి? నీవృత్తాంతమంతయు నెఱింగింపుము. నీయందు మాకు గనికరము గలుగుచున్నదని పలికిన విని యక్కలికి యిట్లనియె.

తల్లీ! నీవు ముల్లోకములలో వాసికెక్కిన పతివ్రతవు నీపేరు దలంచిన స్త్రీలు పూణ్యాత్మురాండ్రగుదురు. నీవు నాకభయహస్త మిచ్చితివి. ఇంక నాకుఁ గొదవలేదు. వినుము నేను శీనరుఁడను నరనాధుని కూఁతురను నాపేరు జితవతియండ్రు. యోగసక్త యను వసుపత్నితో నాకు మైత్రి గలిగినది. అమె నన్ను దివిజకాంతంజేయు తలంపుతో మీధేనువుంగట్టి తీసికొనిరమ్మని పతిని బోధించినదఁట. అక్కారణంబు నంజేసి మీభర్త వారిని శపించెనఁట. అవృత్తాంతము విని నేబరి తపించుచు జటావల్కలములధరించి పురమువిడిచి మీయొద్దకు రా బయలుదేరితిని అని తాను నగరము విడిచినది మొదలు నాఁటి తుదదనుక జరిగినకథయంతయు నివేదించినది.

అయ్యుదంతము విని యాపతివ్రత వెరగుపాటుతోఁ బతిమొగము జూచినది. వసిష్టుండు దివ్యదృష్టినంతయుఁ జూచి యౌను ఈశీలవతి జెప్పినదంతయు సత్యము మఱియు నిందు స్వగుణోత్కర్ష విడిచినదని యెఱింగించెను.

అప్పుడరుంధతి యాసుందరిని గౌఁగలించుకొని ముద్దిడుకొనుచు పుత్రీ! నీ యట్టి కృతజ్ఞురాలి నేపురాణములో వినియుండలేదు. నీ సుగణంబులెన్న ఫణిపతి చాలదు నీశీలము మా కెంతేని మెప్పువచ్చినది మఱియు హోమధేనువను నీమహర్షికిఁ బ్రాణమువంటిది. వసువులు దానిం దీసికొని పోయిరి అలిగి యిమ్ముని వారిని శపిం