పుట:కాశీమజిలీకథలు -07.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసిష్ఠుని కథ

69

అంతలో నామునికుమారుండు పలాశ దండము చేతంబూని యచ్చటికి వచ్చెను. వారికిట్టి సంవాదము జరిగినది.

శిష్యు - అమ్మా ! నీవే మునికన్యకవు? పులితోలు ముడతగా బూని శిరంబున దాల్చితివేల? నీపేరేమి? యెందుండి వచ్చుచుంటివి?

జితవతి - ఋషిపుత్రా ! నేను మునికన్యకనుగాను. రాజపుత్రికను. నాపేరు జితవతియంద్రు ఈపులి బ్రతికియున్నప్పుడు (అని కన్నీరు గార్చుచు) నాకమిత మైన యుపకారము గావించి నానిమిత్తమై సమసినది. దానంజేసి యీకృత్తి నిట్లు భక్తితోఁ బూజించుచుంటిని.

శిష్యుఁడు - తపఃప్రభావంబులు సత్వంబులు మునులకు భృత్య కృత్యంబులు గావించుట యాచారమై యున్నది. నీకు దీనియందిట్టి కృతజ్ఞత గలుగుట స్తుతిపాత్రమై యున్నది గదా !

జిత - బాలకా! నీవెవ్వని కుమారుండవు? ఈతపోవన మెవ్వరిది?

శిష్యు - తల్లీ ! ఈవనము త్రిభువనవిదితుండైన వసిష్ఠమునీంద్రుని తపోవనము నేనాయన శిష్యుండ హోమధేనువుం గాచువాఁడ.

జిత - హోమదేనువన నందినీధేనువేనా?

శిష్యు -- అవును వారికి మఱియొక మొదవులేదు.

జిత - పుత్రా ! ఈనడుమ వసువులు దానిం దీసికొని పోయిరని వింటి. సత్యమేనా?

శిష్యుడు - సత్యమే అందులకు వారికిఁ బ్రాయశ్చిత్తమైనది. కాదా?

జితవతి - ఏమైనదితండ్రీ ? చెప్పుము చెప్పుము.

శిష్యు - వారినెల్ల మనుష్యయోనిం బుట్టునట్లు శపించెను.

జిత - తండ్రీ వారువచ్చి పాదాక్రాంతులైరని వింటిని కనికరించి యమ్ముని వారి శాపవిముక్తులం జేయలేదా?

శిష్యు - తల్లీ ! అప్టమవసువు ప్రభాసునితక్కఁ దక్కిన నేడ్వురను జన్మ మాత్రముననే విముక్తులగునట్లు కనికరించెను.

జిత - ప్రభాసు నేమిజేసెను.

శిష్యు - అతఁడే యీయపరాధమునకెల్ల కారకుఁడు. వినుము వాఁడు పుడమి మనుష్యుఁడై పుట్టి భార్యాపుత్రులులేక దరిద్రుఁడై యాధివ్యాధులు బాధింపఁ బరమ మూర్ఖుఁడై క్రూరకృత్యములు గావింపుచుఁ బెద్దకాలము బ్రతుకఁగలఁడని శపించెను.

జితవతి - హా పరమేశ్వరా! హా పరమేశ్వరా !. యెట్టికర్ణ కఠోర వాక్యము