పుట:కాశీమజిలీకథలు -07.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సన్యాసుల కథ

67

ఆ వెతలోఁ బ్రద్యోతన నగరమునుండి రోహిణిరాజదూతల వెంటనందు వచ్చిన దను వార్త యెవ్వరో చెప్పినంత రాజపత్ని లేచి యేది యేది నాబిడ్డకూడ వచ్చినదా ? అని యడుగుచుండ రోపోణి వచ్చి యామె పాదంబులంబడి గోలున నేడువ దొడంగినది.

అప్పుడు శీనరుఁ డూరడింపుచుఁ రోహిణి ! లెమ్ము లెమ్ము. శోకించినం బ్రయోజనంబులేదు నీ విప్పు డెందుండి వచ్చితివి? జితవతి యేమైనది? వసిష్ఠాశ్రమమునకుఁ బోయితిరా ? మీ వృత్తాంతము కొంత తెలిసినది. సన్యాసుల విడిచిపోయిన పిమ్మట నేమిజరిగినదియో చెప్పుమని యడిగిన వెరగుపడుచు లేచి కన్నులం దుడిచికొని నమస్కరించి యిట్లనియె.

దేవా ! జితవతికి వసిష్ఠునిఁ జూడవలయునని తలంపుతప్ప వేరొక తలంపులేదు. నా యావచ్చక్తి నా పయనము మానిపింప‌ వలయునని చూచితిని సాగినదికాదు. నిప్పునకు జెదలుపట్టిన నదియే నశించును. యోగు లామె నేమి సేయగలరు? ఆమె శీలమునకు మెచ్చికొని పెద్ద పులులు భృత్యకృత్యములు నెరవేర్చనవి. యమునలో మేము విడిపోయితిమి. ఆమె పులితోఁ బ్రద్యోతన నగరము జేరినది. పౌరులకుఁ దదీయ మహిమాతిశయము విస్మయము గలిగించెను.

రాజపుత్రుఁడు ప్రభాకరుఁ డామెతో ముచ్చటించెను. పులి సమసిన దాని తోలు శిరంబునంబూని యావీడు విడచి య యుత్తర ప్రదేశమున కరిగినఁదట. నన్ను దొంగగా నెంచి యారాజు నొద్దకుఁ దీసికొనిపోయిరి. నేనా రాజకుమారునికి యదార్థము జెప్పి వైచితిని. ఆ యోగి జితవతియని వినిన పిమ్మటఁ బ్రభాకరుఁడు మిక్కిలి పరితపించుచు నన్ను వెంటఁబెట్టుకొని యుత్తర దేశారణ్యము లన్నియుం దిరిగెను.

ఎందును నామె గనంబడినదికాదు. ఆ యడవులలో దిరిగినట్లు కొన్ని జాడలు దెలిసినవి. గురుతులు జూచికొనుచుఁ బోవంబోవ యమునానదీ పరిసరమున దట్టముగా గుమురుకొనియున్న చెట్లనడుమ నొక వృక్షశాఖకుఁ పాదములు దగిలించి తలక్రిందుగాఁ దపము గావింపుచున్న యొక యోగి మా కన్నులం బడియెను.

భయభక్తి సంభ్రమములతో నా చెట్టుచెంతకుఁ బోయి శిరంబునఁ జేతులు జోడించి వినయముతోఁ బ్రార్దించుచు నందు నిలువంబడితిమి. సాయంకాలమున కయ్యోగి తపంబు జాలించి‌ యోగంబు వదలి చెట్టుదిగి యమునకుం బోవుచుండ నడ్డమువచ్చి పాదంబులఁబడి మహాత్మా ! జితవతియను రాజపుత్రిక వెఱ్ఱియెత్తి యీ యడవుల దిఱుగుచున్నది. . ఆ చిన్నది మీ యొద్దకు రాకమానదు. వసిష్టమహర్షి యాశ్రమమున కరుగ సంకల్పించుకొని యన్నది. ఆ ముగుద మీకుఁ గనంబడి