పుట:కాశీమజిలీకథలు -07.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

కాశీమజిలీకథలు - సప్తమభాగము

విశ్వాసము గలదు. సర్వసంగత్యాగిని యైనను నామెకా పులి యందుగల మమకారము పామరులకైన నుండదు.

తరువాత నేను రెండు మూడుతేపలు పాలును ఫలములు పూవులు పట్టించుకొని యందు బోయితిని. కాని నాతో నేమియు మాటలాడినదికాదు. నా రాకయు నిష్టములేనట్లు గ్రహించి తరుచు పోవుట మానితిని.

నేఁటి యుదయమున పోయి చూడ నామెజాడ గనంబడలేదు. జనసంపర్క మొల్లక యెందో పోయినది. ఇదియే యామె వృత్తాంతమని ప్రభాకరుఁ డెఱింగించిన విని ప్రబ్యోతనుండు వత్సా ! జడభరతుండు లేడపిల్ల కై మమకారము నొందినకథ నీవు వినలేదా? మహాత్ముల చరిత్రలు విచిత్రములు ఆమె యత్తర దేశారణ్యములలోఁ దపము జేసికొనుచుండ నకస్మాత్తుగ యమునానది పొంగుటచేఁ బులితోఁ గొట్టికొని వచ్చినది. అది ఆశ్రమమృగమై యుండవచ్చును. పోనిమ్ము ఎవ్వరినేమని శపించునో యని వెరచుచుంటిని శాంతముగా నూరు దాటినదిగదా? అని పలుకుచున్న సమయంబున ద్వారపాలుఁడు వచ్చి దేవా ! నమస్కారము. రాజభటులొక యోగినినిం బట్టి కట్టి తీసికొని వచ్చి ద్వారమున వేచియున్నారు. ప్రవేశమునకు సెలవు? యని యడిగిన నా యొడయఁడు జరియుచు అక్కటా ! యోగిని నేమిటికిఁ గట్టన యు, నిది యపచారము గాదా ! సత్వరముగాఁ దీసికొని రమ్మని యోజ్ఞాపించెను.

చేతులకు నిగళంబులం దగిలించి రాజభటులొక యాగినిని రాజు ముందర నిలువంబెట్టిరి. ప్రభాకరుఁడామె యాకార మోగాదిగఁ జూచి తండ్రీ ! వేష మట్టిదేకాని యీమె యామెకాదు అనుటయు రాజు వెరచుచుఁ జేతిగొలుసులు విడదీయించి యీమె జేసిన తిప్పేమియో యెఱిగింపుఁడని యడిగిన దండనాధుం డిట్లనియె.

దేవా ! ఇది వేషమునకే యోగినిగాని క్రియలచే గజదొంగల మించినది వినుండు. కొలఁది దినములక్రిందట నొకఱేయి మత్సపురిలోనొక భాగ్యవంతుని యింటికింజని పండుకొనుటకు దావడిగినదట. సన్యాసిని యని పూజించి దీని నింటిలోనికిం దీసికొనిపోయి పండుకొనఁ బెట్టిరి ఈ రండ యింటి వారందఱు నిద్రించుచుండ నర్థ రాత్రంబున దలుపులుదీసి జాడలుజెప్పితోడిదొంగలచే నిల్లు కొల్ల బెట్టించినది.

తెల్లవారిన వెనుక నిల్లుజాచికొని యజమానులు గొల్లున నేడ్చుడుండ నీ గండ రగడం వారింకన్న నెక్కుడుగా. వగచినదఁట ఆ సమాచారము విని మేము వోయి జాడలుదీసి నిజము దెలిసికొని దీనింబట్టికొని తీసికొని వచ్చితిమి. ఎన్నిగొట్టినను మాటాడదు. ఇంత మొండిగరాసు పుడమిలో లేదు కుడువక త్రాగక యెన్ని దినములైన నుపవాసములు చేయఁగలదు. ఈ చేడిపై యవ్వల నెక్కడనో దొంగతనము