పుట:కాశీమజిలీకథలు -07.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కాశీమజిలీకథలు - సప్తమభాగము

దూరి తలుపులు వైచుకొనిరి. వీరి కందఱకు బాధలు గలుగఁజేయనేల ? మఱియొక చోటికిం బోయెదంగాక అని తలంచుచు వెనుకకు మరలి మరియొక దారిం బోవుచుండ నొకదండ సమున్నతప్రాకార గోపుర మండితంబగు దేవాలయమొకటి యామెకుఁ గన్నుల పండువు గాంచినది. అందున్న నెవ్వరికి బాధ గలుగదని తలంచి యా చెలి‌ పులితోఁగూడ లోపలం ప్రవేశించినది.

రాజయోగి కథ

రాజయోగియను సన్యాసి యొకఁడా దేవాలయములో నుత్తర దెస చావడిలో నివసించియుండెను. అతండు ప్రాయంబునఁ జిన్నవాఁడైననుఁ బ్రగల్భ వచనములచే మహానుభావుడని తోచునట్లు జనులు కడ లుపన్యాసము లిచ్చుచుండెను మంత్రములకుఁ గొందరు తంత్రములకుఁ గొందరుఁ సంతతికిఁ గొందరు, సంపదలకుఁ గొందరుఁ దన్నాశ్రయింప అందఱకు నాస జూపుచుఁ ద్రిప్పుచుండును.

పులివార్త విని పౌరులు కొందఱా యతి యొద్దకుఁ బోయి “మహాత్మా ! కాళిందీ ప్రవాహంబున నొక పులియుం జెలియుం గొట్టికొని వచ్చి మనయూరఁ గట్టెక్కిరి. అయ్యోష కాషాయాంబరధారిణియై జటాకలాపములతోఁ దపంబు జేయం బూనిన రెండవ పార్వతి వలెఁ బ్రకాశించుచున్నది. ఆ పులి యాచెలికడ దూడవలె మెలంగుచు మృత్యువువలెఁ బ్రజలపైబడి కఱచుచున్నది. వీరభటులఁ బెక్కండ్రఁ జంపినది. దానికా యోగినీ ప్రభావంబున నెక్కడలేని బలము వచ్చినది. వీరభటులు వెరచి పారిపోయిరి. మీరు వచ్చి యా పులి యుపద్రవము దప్పింపవలయును. మీ తంత్రము ప్రదర్శింప అవసరము వచ్చినది. కౄర మృగముల దూడలవలె వశము జేసికొందుమని యింతకుముందు మీరీవీఁటఁ బ్రకటించి యున్నారు గదా! లెండు రండు అని పలికిన విని యా యోగి అబ్బురపాటుతో విని యేమీ ? యోగినియా ? పులితో వచ్చినదియా ? కానిండు అందులకు మీరింత వెరువనేల? పులినిఁ జెలినింగూడ మంత్రబద్ధులం జేసి యిందు రప్పించెదఁ జూడుడు. అని పలుకుచుండగనే యాచిన్నది పులితో గుడికిఁ బ్రదక్షిణము చేయుచు నుత్తర దెసకుఁ బోయినంత నందున్న ప్రజలు బాబో బాబో పులి యిక్కడికే వచ్చినది అని కేకలు వైచుచు మూలమూల స్థంభములచాటున దలుపులవెనుక దాగఁదొడంగిరి. ఆయోగి‌ అందఱకన్న ముందు యందున్నగదిలో దూరి తలుపువైచుకొని గవాక్షము నుండి చూచుచుండెను.

పులి యెవ్వరివంకంజూడక యా యబల వెంట మెల్లన నవ్వలికిం బోయినది. అప్పుడు ప్రజలు తమ్ముఁ బునర్జీవితులుగాఁ దలంచుకొని స్వామీ ! మీరిన్నియుంజెప్పి