పుట:కాశీమజిలీకథలు -07.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కాశీమజిలీకథలు - సప్తమభాగము

చుండెను. తీరస్థులు వానికి వానికిఁ దొరకునని పందెములు వైచికొనుచుండిరి. వాండ్రిద్దరు నొక్కసారియే యద్దారవునొద్దకుఁ బోయి నాది నాదియని కేకలు వైచుచు దానిపై జేతులు వైచిరి.

అలయికలుదీర నా దారువుపైఁ గాళులు మోసికొని యున్న యొక పులి వారి రొదవిని గాండ్రుమని అరచినది. ఆ ధ్వని విని యా యీతగాండ్రు బాబో పులి పులి అని అరచచు మరలి దరిదెన కిడికొని పోవుచుండిరి. అంతదనుక నా దారువు నూతగాఁ ప్రవాహవేగంబునం పోవు వ్యాఘ్రం బప్పుడా కాష్టంబు వదలి యా యొడ్డు వైపున కీద మొదలు పెట్టినది. అది వారిం దరిమికొని వచ్చుచున్నదని తలంచి తటస్థులు పులి పులి అని పెద్దకేకలు వైచుచు ధాసి ధాసి అని అందలించుచుఁ జప్పటులు గొట్టఁ బ్రారంభించిరి.

ఆ పులి మూపుపై శిరంబు మోపి పండుకొనియున్న యువతి యొక తె యా చప్పుడులు విని అదరిపడి లేచి తీరము వంక జూచుచుండెను. ఆ మృగంబు వారి అరపులకు బెదరక పదిలముగా నీదికొని పోయి వీపుపైనున్న మదవతి కదలకుండ నొకచో గట్టెక్కి నిలువంబడినది.

దానిం గాంచి యందున్న వారెల్ల పికాపికలై తలయొక్క. దెసకుఁ బారిపోఁ దొడంగిరి. వివిక్తమైయున్న యా ప్రదేశమున నా యువతి పులిందిగి తడి పుట్టంబు బిండికొని పైట చెరఁగుటచే నా పులిమేని తడి అద్దుచు నేటివంక జూచి యేదియో ధ్యానించుచుండెను.

మఱియు నా పెద్దపులిని ముద్దుపెట్టుకొనుచు మృగరాజమా। నీకు నే నేమి యుపకారము జేసితినని నన్నుఁ జంపక ముంపక యీదరి జేర్చితివి? నేను గృతఘ్ను రాలనని యెఱుంగవు కాబోలును. అందఱి వలనం బనులుగొనుటయే వాని యొక్కరికిం ప్రత్యుపకారము జేయఁజాలను. నీతోడి పులియు నాతోడి చెలియుం గొట్టికొని పోయిరి. వారింగలసికొందము పద పద అని పలుకుచు నా జవరాలు ఏటి తీరమున మెల్లగా నడువం దొడంగినది. ఆ పులియుఁ దోఁక యాడించుచు నామె మేను మూర్కొనుచు వెనువెంట దూడవలె నడచుచుండెను.

ఆ వింత దవ్వులనుండి చూచి పౌరులు వెరఁగుపాటుతో నోహో! యిది పెంపుడు పులి కాఁబోలు తెలియక భయపడితిమని పలుకుచు మెల్ల మెల్ల దాని దాపునకుఁ జేరికొని వెంట నడువఁ దొడంగిరి. పులి యేమియు బెదరక‌ అమ్మదవతి వెనుక నడుచుచుండెను.

గ్రమంబున బౌరులు భయము విడిచి పడతిని బులిని వింతఁగా జూచుచుఁ