పుట:కాశీమజిలీకథలు -07.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మూటగట్టికొని రమానందునితోఁ గూడ నాయడవియంతయుఁ బెద్దతడవు వారిని వెదకెను. ఎవ్వరి జాడయుఁ గనంబడినదికాదు. బ్రహ్మానందయోగియే కపటముజేసి యాకాంతల దాటించెనని నిశ్చయించి వాండ్రిద్దరు మరునాఁడు ప్రొద్దు గ్రుంకక పూర్వము అడవి తెఱవులన్నియు వెదకుచుఁ గ్రమ్మర బ్రయాగమున కరుదెంచి మాధవమఠంబునకుఁ జని యందు బ్రద్యుమ్నయోగింజూచి మహాత్మా! బ్రహ్మానందయోగి యెట్టిపని చేసెనో చూచితిరా మీకేదియో తృణము సొమ్మర్పించి మీమూలమున నాయోగినుల బ్రహ్మానందయోగి వశముగావించితిమి. అతండు నమ్మకముగానే నాటకము నడిపించి నిన్న మేమీయూరు వచ్చినంత నా కాంతలం దీసికొని యెందో పోయెను. బ్రహ్మానందునకు నేబదిమాడలిచ్చితిమి మాసొమ్మంతయు హరించి చివరకు మాకపకారము గావించెను. అని చెప్పినవిని ప్రద్యుమ్నయోగి అయ్యో ? మీకార్యము సఫలము కాలేదా! బ్రహ్మానందయోగియు ముసలియోలయు బ్రొద్దుటనాకు గనంబడిరే ? నేనేమియు వారినడుగలేదు. బ్రహ్మానందయోగికట్లు చేసిన లాభమేమి? వృద్దుఁడుకాఁడా అని పలుకటయు

వాండ్రు ఏమీ ? బ్రహ్మానందయోగి యిందుజేరెనా. ఎందున్న వాఁడో వెదకి మీయొద్దకుఁ దీసికొని వచ్చెదము. న్యాయము విచారించి మాసొమ్ము మా కిప్పింప వలయును. వ్యర్దముగా రుణము పాలైపోయితి మని పలుకును వాండ్రిద్దరు కదలి యా మఠమంతయు వెదకి యొకచోటఁ బండికొనియున్న బ్రహ్మానందయోగిని కపటవసిష్ఠునిం జూచిరి.

బ్రహ్మానందుఁడు వారిఁ జూచి లేచి యోహో వత్సలారా ! మీకొరికై యరయు చుంటిమి. మీరు వెళ్ళినవెంటనే నేనా నారిమణుల బిలుచుటకు వారి పర్ణశాల కరిగితిని. తెల్లవారక పూర్వమే యాయలి వేణు లెందో పారిపోయిరి. ఆ యడవి యంతయుఁ వెదకితిమి ఎందునుం గనంబడలేదు. ఇఁక మేమందుండనేల నని యీ బడుగువాని వెంట నిడుకొని యాదారులన్నియుం జూచుచు నేఁటి మధ్యాహ్నము యిందు జేరితిమి. మీరందు బోయివచ్చితిరా? ఆ యాఁడువాండ్రు మన కపటము గ్రహించిరిసుఁడీ ఈ బోసునోటి బడుగువాని మూలమువ నీగుట్టు తెల్లమైనది. మంచి కల్పనయే చేసితిమి. ప్రయోజనము లేకపోయెనని యూరఁటబలికిన విని రమానందుఁ డిట్లనియె.

అదియంతయు నిజమే కాని మేము వచ్చుదనుక మీరందుండక యిందేల వచ్చితిరి. ఈ తప్పు మీయందున్నది మేము మీకు కప్పగించి వచ్చితిమి. మీకుఁ దెలియకుండఁ బారిపోవుటకు వారికి రెక్కలు వచ్చినవియా యేమి? చీఁకటిలోఁ బోలేరుగదా. తెల్ల వారి పోయినచో మీరు వెంటఁబోయి పట్టుకొనఁజాలరా? మీరు తప్పక వారిందెలి