పుట:కాశీమజిలీకథలు -07.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయా వసిష్ఠుని కథ

43

కాను అమ్మదవతి పసరు పిండిన వానికే తగులమగును. రెండవ వానిం జూడదని మనోహరదాసు జెప్పలేదా.

రమా - నేను బలవంతము జేసి వినిపించనా ? నన్ను మిత్రద్రోహునిగాఁ దలంచుచుంటివా యేమి.

చిదా - నాకామాట లేమియుం జెవి కెక్కవు నీవు బిండిన నీకే. నేను బిండిన నాకే వశమగును. చెప్పి పెట్దిన ప్రీతియేమి నిలుచును ? అట్టి నమ్మకము నీకుండిన నన్నే పిండనిమ్ము.

రమా -- నీమాత్రము తెలివితేటలు నాకునుం గలిగియున్నవి. నీవు నాకంటెఁ బలవంతుఁడవుగావు. నామాట నమ్మిన నమ్ముము. పసరు మాత్రము నీకీయను.

చిదా - బాగు. బాగు. మంచినేర్పరివే బలముగల వాఁడవని నన్ను మోసము జేయుదువా?

రమా - నీకేమి మోసము జేసితిని. చేసిన పిమ్మట అడిగిన బాగుండును.

చిదా - చేతిలోఁ బడినదని పసరీయకపోవుట మోసముకాదా. కానిమ్ము. నామేనిలోఁ బ్రాణము లున్నంతసేపు నిన్నాపసరు పిండనీయను చూడుము.

రమా - రమ్ము. రమ్ము. నీబలమెట్టిదో చూతునుకాదా.

అని పలుకుచు రమానందుఁడు వడివడిగా ముందు పరుగిడఁ దొడంగెను. వాని వెంటఁ జిదానందుఁడు కేకలువేయుచుఁ బరుగెత్తుచుండెను. ఇరువురు కొంత సేపటికిఁ బర్ణశాల జేరిరి. అందెవ్వరు గనంబడలేదు. కపట వసిష్ఠుని బ్రహ్మానందయోగిని యెలుగెత్త పిలిచిరి. ప్రతివచనము లేదు. యోగినుల పర్ణశాల శూన్యమైయున్నది. ఆ ప్రాంత మార్గమంతయు వెదకిరి. ఏజాడయుం దెలియలేదు.

అప్పుడు చిదానందుఁడు దైవములేడా. మిత్రద్రోహము చేయువారికి విఘ్నములు గలుగఁజేయఁడా ? నీవేయాపసరురాచి యాచిగురుఁ బోడిం గూడుము. నేనూరాక విచారించుచుం బోయెదను ఎన్నడుననుభవంచినంగాని తెలియదు. అని వానిం దూఱుటయు రమానందుఁడు మిత్రమా ! నేనూరాక యట్లంటినిగాని నిన్ను ద్రోహముచేయుదునా, మనస్నేహ మీనాఁటిదియా. నామాటలు నీవు మనసులో నుంచకుము పరిహాసమున కంటిని. ఇదిగో పసరు నీయొద్దనే యుంచుము. ఆయువతి కనంబడినతోడనే నీవే పిండుము అనిపలుకుచు వాని చేతం బెట్టెను. చిదానందుఁడు తలకంపించుచు బిచ్చుకల పోరు పిల్లితీర్చినట్లు మనల మోసముజేసి బ్రహ్మానందయోగి యయ్యిందుముఖుల నెందోతీసికొనిపోయెను. ఆపొలఁతుక కనంబడనినాఁడు నాకాపసరేపటికి అసవ యెఱింగియే నాకిచ్చితివి. నే నెఱుంగననుకొంటివా? కానిమ్ము ఎట్లైన లెస్సయే అని యాయాకు