పుట:కాశీమజిలీకథలు -07.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6]

మాయా వసిష్ఠుని కథ

41

రాదు. వాండ్రు మిగుల గండ్రలు. మాటాడిన దప్పులు బట్టుదురు. దానంజేసి, మౌనమే యవలంబించితిని.

చిదానందుఁడు -- వీఁడీ వేషమునకుఁ దగఁడు బ్రహ్మానందయోగి కీ వేషము వేయవలసినది, తప్పు జేసితిమి వీనిం జూడ మనకే యసహ్యముగా నున్నాఁడు. వారి కెట్లుండును.

రమా - బ్రహ్మానందుఁడు మొదట నంత యభినయముచేయనిచో వారు నమ్మి యింతదూరము వత్తురా? ఇప్పుడా యెట్లయిన మనచేతిలోనివారే. యెక్కడికి బోఁగలరు ?

బ్రహ్మా - ఈ వేషమునకు వీఁడుతప్ప మఱియెవ్వరును దొరకలేదా? వీని వేషభాషలు బాగులేవు. నిజముగా వసిష్ఠుఁడు వచ్చి యచ్చట నిలుచున్నట్లు మాట్లాడవలదా ?

రమా - ఏమి చేయుదుము. మరియెవ్వరును దొరకలేదు. ఈ విధవకైనను నిరువదిమాడ లిచ్చుటకు నిశ్చయించితిమి. సగము సొమ్ము చేతిలో వైచినంగాని బయలుదేరనేలేదు.

బ్రహ్మా - నాతోఁ జెప్పినఁ బదుగురం గుదురుతునుగాదా ? వీఁడు చాల పెద్దవాఁడు కావున నేమియు మాట్లాడలేకున్నాడు.

రమా - వసిష్ఠ వేషమునకుఁ జిన్నవారలు పనికివత్తురా ? జడలు నెఱియ వలయుంగదా ?

చిదా - పోనిండు. ఇప్పుడేమి యనుకొన్నను లాభము లేదు. మాచేతి సొమ్ము వదలినది ఫలము గలుగలేదు. వాండ్రీ దినమున నిచ్చటికి రానేలేదు. మొదట నున్న భక్తి జతవతికిని లేదు.

రమా -- బ్రహ్మానందా ! మేమీ వేకువజామునలేచి ప్రయాగమున కరిగి మనోహరదాసుతో మాట్లాడి సాయంకాలమునకు వత్తుము. మీరీ లోపల నాచపలనేత్రల నిచ్చటికిఁ బిలిచి చెప్పవలసిన మాటలన్నియుం జెప్పుఁడు. ఒడంబడినసరే లేకున్న బలాత్కారమే కావింతుము.

చిదా -- మేము లేకున్న వారిందువచ్చి నిర్భయముగా మాట్లాడుదురు.

బ్రహ్మా -- మనోహరదాసుతో మాట్లాడవలసిన అగత్య మిప్పుడేమి వచ్చినది ?

రమా - వాఁడును మావలనఁ గొంత సొమ్ము తిని కపటము జేసెను. ఆఁడువాండ్రతోఁ గలసి మెలసి తిరుగుచున్నప్పుడు వచ్చిన నేవియో తంత్రములు చెప్పెదనని చెప్పెను. మాకట్టి అవకాశ మిప్పుడు గలుగుచున్నది కావున వాని యొద్ద