పుట:కాశీమజిలీకథలు -07.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మానందయోగి కథ

35

చిదానందుఁడు సందియమేలా ? అట్లే చేయుదము. సుందరులారా ! యిందుఁ గూర్చుండుడు యోగి కన్నులం దెరచు సమయమైనదని చెప్పుచుండఁగనే అతండు కన్నులువిప్పి జపమాల జెవులకుఁ దగిల్చికొని కమండలూదకమున నేత్రములఁ దుడిచికొనుచు శిఘ్యని వంకజూచి రమానందా ! త్రివేణి కరిగి యింత యాలస్యము చేసితివేమి ? నామిత్రుఁడు ప్రద్యుమ్నయోగి కనంబడెనా ? యని అడిగిన వాఁడు వినయ మభినయించుచు స్వామీ ! చూచితిని. మాట్లాడితిని. గురుకటాక్షము గలిగినది. మీ చంపకారణ్య గమనవృత్తాంతము విని ఈ యోగినుల మీయొద్ద కనిపిరి. అందునను వసిష్టమహర్షి యొద్దకు వీరిం బదిలముగాఁ దీసికొని పొమ్మని మఱియు మఱియుం చెప్పుమనిరి. వీరి కతంబున నించుక యాలస్యమైనదని చెప్పినవిని బ్రహ్మానందయోగి యాయోగినులపై చూడ్కులు వ్యాపింపజేసెను.

అప్పుడమ్ముద్దుగుమ్మ తద్దయు భయభక్తి వినయవిశ్వాసములతో నయ్యోగి పాదమూలమున వ్రాలి మహాత్మా ! రక్షింపుము రక్షింపుము. నీకు శిష్యురాండ్రమైతిమి వసిష్ఠమహర్షి దర్శనము జేయింపుమని ప్రార్థించిరి. ఆసమయమున నాశిష్యు లిద్దరు నెద్దియో పని కల్పించుకొని దూరముగాఁ బోయిరి.

అప్పుడు బ్రహ్మానందస్వామి తరుణులారా ! లెండు లెండు. కుసుమకోమలమైన యీ ప్రాయమున మీరిట్టి యోగినీవేషము ధరించుటచే మీవ్రతపటుత్వము వేర యిట్టిదని పొగడ నవసరము లేదు. విరక్తిచే యోగినులై తిరిగెడు మీ పూర్వ వృత్తాంత మడుగుటకు తప్పుగదా? మీ నియమప్రచారములు సోత్రపాత్రములై యున్నవి. మీ రిప్పుడు తత్వ శ్రవణేచ్ఛచే వసిష్ఠుం జూడఁబోవుచున్నారా యేమి? వేరెద్దియేనిఁ గారణ మున్నదియా? ఆ యతిపతి యిప్పుడు చంపకారణ్యములో నున్నవాఁడు. అయ్యడవి యిక్కడికి రెండు పూటలు పయినములో నున్నది. పోవచ్చును. మీ అభిలాష యేమి అని అడిగిన జితవతి రోహిణి మొగము జూచుటయు నా చంద్రవదన యిట్లనియె.

స్వామీ ! యిప్పుడు మీతో యదార్థము చెప్పక తీరదు. యోగిసక్త యను వసుపత్ని ఈమెతో మైత్రిజేసినది. ఆమె ఈమె నిమిత్తమై వసిష్ఠమహర్షిచే శపింపఁబడినదఁట. ఆకథవిని ఈ వనిత వారి శాపము గ్రమ్మరింవ అమ్మునిపతిం బ్రార్థింప నరుగుచువ్నది. తత్వశ్రవణేచ్ఛగాదు. మాకు వారి దర్శనము జేయించి పుణ్యము గట్టి కొనుఁడు అని ప్రార్థించినది.

ఆ కథవిని బ్రహ్మానందయోగి శిరఁకంపము జేయుచు నయ్యారే నీ కృతజ్ఞత మిక్కిలి కొనియాడఁ దగియున్నది. అప్పారికాంక్ష దయా హృదయుఁడగుట నీ కాంక్ష నెరవేర్పవచ్చును. ఇప్పుడే పోవుదము. ఇందులకు నన్నంతగాఁ బొగడ