పుట:కాశీమజిలీకథలు -07.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5]

బ్రహ్మానందయోగి కథ

33

వేమి? మన మెవ్వరమో ఆమెయు వారే. యంతయుఁ బరబ్రహ్మస్వరూపము ఆత్మకు స్రీపుం వివక్షతయుఁ గులశీలనామంబులుం గలిగియున్నవియా? అమె విరక్తురాలు. ఈశ్వరమహిమఁ దెలిసికొన నెవ్వరి శక్యము? ఏ జీవుల కే కాలమున నెక్కడ నేది కావింపవలయునో ఆ జీవుల కా కాలమున నక్కడ నది కావింపకతీరదు. వారికి వారియందు భక్తిగుదిరినది వారిం జూడఁబోవు చున్నారు. సాధువులకుఁ బరోపకారము కన్నఁ బుణ్యకార్యము లేదు. ఆశ్రితరక్షణము సహప్రయాగఫలదంబని కృతులు ఘోషింపుచున్నవి మీరు నామిత్తముగా వీరికొక యుపకారము చేయఁగోరుచున్నాను. మీ గురువుగారితో నామాటగాఁ జెప్పుము. వీరిని జంపకారణ్యమునకుఁ దీసికొనిపోయి వసిష్టమహర్షి దర్శనము చేయింపుఁడు. చెంతఁజేరిన వారి కోరిక తీరుపక నాచిత్తము సంతసింపదు. నేను వృద్దుండనగుట రాలేను. దైవికముగా నమ్మునిపతి ఈప్రాంతమునకు వచ్చుట వీరి యదృష్టమే. అమ్మా ! యోగినీ ! ఈతండు ప్రాయంబునఁ జిన్నవాఁడైనను సకల ధర్మములు దెలిసినవాఁడు వీని గురువు వసిష్టుని మిత్రుఁడేకదా. కనుక నీవును నీబంధువులును వీనివెంట బ్రహ్మానందయోగియొద్దకుఁ బోవుఁడు ఆయన మిమ్ము దీసికొని పోఁగలడని చెప్పెను.

రోహిణి వృద్ధయోగిని స్తుతియించుచు బ్రహ్మానందయోగి యెంతదూరములో నున్నవాఁడని అడిగిన గ్రోశదూరములో నుండెనిప్పుడేపోయి చూడవచ్చునని రమానందుఁ డుత్తరము జెప్పెను.

అప్పుడు రోహిణి యించుక యాలోచించి ఆర్యా ! మీదేశికుఁడు చంపకారణ్య కెప్పుడు పోవునో మారాక కనుమతించునో తెలిసికొని వత్తురేని మీకు గృతజ్ఞురాలనై యుండెద నిప్పటినుండియు నందువచ్చి యేమిచేయఁగలము. అని యడిగిన రమానందుఁడు అబలా ! మీకా సందియము వలదు. మాగురువుగారు సహజముగా నుపకారశీలురు వీరియాజ్ఞ యయ్యెనేని చెప్పిన మఱియు సాహసింతురు. మీరెప్పుడు వచ్చిన అప్పుడే బయలుదేరుదురు. మీబంధువులం దీసికొనిరండు పోవుదమనుటయు రోహిణి జితవతియొద్డ కరిగి యిట్లనియె.

సఖీ ! జితవతీ ! ఇప్పుడు వసిష్టమహర్షి చంపకారణ్యమునకు వచ్చియుండెనని శుభవార్త యొకటి వింటి. అది సత్యమేయైనచో మనము కృతార్దులమే. అని తాను బోయి విన్నకథ అంతయుం జెప్పినది‌ అప్పుడు జితవతి మూపు లెగరవైచుచు, రోహిణీ ! నియమితచిత్తులగు దైవము సహాయము చేయకపోవునా ? ఆత్మజ్ఞాన వేదియగు అత్తపసి మనరాక విని యెదురువచ్చుచున్నాఁడని నమ్ముము ఇది యంతయు వీరు కల్పించిరని నీకనుమాన మున్నట్లు తోచుచున్నది. అట్టి కల్పన