పుట:కాశీమజిలీకథలు -07.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అద్వైత తత్వమును గురించి మీకును వారికినిఁ బ్రసంగముజరుగలేదా ? యని చెప్పిన విని అతండు ఆ! జ్ఞాపకమువచ్చినది. జ్ఞాపకమువచ్చినది. నీవా ! బాబూ ! నీవుగడు బుద్దిమంతుఁడవు నీకు శీఘ్రకాలములో నాత్మజ్ఞానము పూర్ణమగునని యప్పుడను కొంటిని నిన్నుఁ జూచుటచే సంతోషమైనది. మీ గురువు బ్రహ్మానందయోగి యిప్పుడెక్కడనున్నాఁడు? బదరికారణ్యమునకో యిఁక బైకెక్కడికో వెళ్ళెనని వింటినిప్పుడు కుశలియై యుండెనా అని అడిగిన వాఁడిట్లనియె.

స్వామీ ! మీ దయవల్ల మా యాచార్యుండు భద్రముగా నున్నాఁడు. నే నాయనతోనే తిఱుగుచుంటిని. నరుఁడు బదరికారణ్యమున కరిగి యందుఁ గొన్ని నాళ్ళుండి యందుండి వసిష్టాశ్రమమున కరుగఁ బ్రయత్నించు చుండగనే వసిష్ట మహర్షి బదరీవనమునకు విచ్చేసెను. అప్పుడు మిగుల సంతసించుచు వారితోఁగూడ మా దేశికుండు ఆత్మజ్ఞానాతత్వమును గూర్చి ముచ్చటించుచుఁ గొన్నిదినములుండిరి. తరువాత వారివురుంగలసి చంపకారణ్యమునకు వచ్చి యందుఁ గొన్ని మాసములు వసించిరి. మొన్నటి మహాశివరాత్రి కీ పుణ్యక్షేత్రమునకు రాఁదలంచి పయనము గావించిరి. కాని వసిష్ట మహర్షి యిందు జనసంబాధ మధికముగా నుండునని తలంచి యా ప్రయాణము మానివేసి యందే యుండెను. మా యొజ్జలు బ్రహ్మానందయోగియు నేనుమాత్ర మీ శివరాత్రి కీ క్షేత్రమునకు వచ్చితిమి. మా గురు వా పశ్చిమభాగమున యమునానదీతీరమున నున్నవారు. ఒండు రెండు దినములలో మరల జంపకారణ్యమున కరుగుచు రిదియే మా వృత్తాంతమని యాకథలో చెప్పెను.

అప్పు డావృద్ధయోగి యేమీ ? వసిష్టులపారు చంపకారణ్యమునకు వచ్చిరా ? ఆ యరణ్య మిచ్చట కనతి దూరములోనే యున్నది కదా? అయ్యో? పాపము నిన్న నెవ్వరో నా యొద్దకువచ్చి వసిష్ట మహర్షి యాశ్రమమునకు మార్గ మెఱింగింపుఁడని యడిగిరి వారక్కడికిఁ బోవుదురు కాఁబోలు. తొందరలో వారికేమి జెప్పితినో జ్ఞాపకములేదు. వారి కాసంగతి దెలిసినఁ జాల సంతసింతురుగదా ? అని యాలోచించుచుండ వెనుక నిలువం బడియున్న రోహిణి యెదురుకువచ్చి స్వామీ ! నేనే మిమ్మా మార్గ మడిగినదాన. నిందేయుంటి మీసంపాదము వింటిని. మీ దర్శనమున మా కార్యసిద్ధియైనదని తలంచుచుంటి. సాధుసాంగత్య మూరకపోవునా యని స్తుతియించినది. అప్పుడు రమానందుడు స్వామీ ! ఈ బాలయోగీని యెవ్వతె. వసిష్టాశ్రమమున కేమిటికై యరుగుచున్నది. అని యేమేమో యడుగఁ బోయినంత వారించుచు వృద్ధయాగి యిట్లనియె.

నీ వద్వైతతత్వవేదియ్యువ బ్రహ్మానందయోగి శిష్యుఁడవయ్యు నిట్లడుగుచుంటి