పుట:కాశీమజిలీకథలు -07.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిదానందరమానందుల కథ

29

రమా -- అందులకే దూరముగా బోవుచున్నది.

చిదా - ఇటురా ఇటురా. (అని బిగ్గరగాఁ బిలిచెను)

అప్పుడక్కడ కొక బ్రాహ్మణపుశ్వస్త దేహబాధకై చేతఁ జెంబుదీసికొని యా మూలకు వచ్చి వారిపిలుపు విని దాపునకుఁ బోయినది చీఁకటిలో నామె నాయోగినియే యనుకొని దాపునకు వచ్చినతోడనే తటాలున లేచి చెరియొకప్రక్కకుఁ చేరి చేయిపట్టుకొని నీకుఁ జిదానందుఁడా? రమానందుఁడా యని అడిగిరి. ఆమె భయకంపిత స్వాంతయై అయ్యో! మీరెవ్వరు? నే నెవ్వతె ననుకొంటిరి? మాది దక్షిణ దేశము. నేను విశ్వస్తను. గాశీయాత్రకువచ్చి యీత్రివేణిలో గంగ బట్టుటకై నిన్నరాత్రి యిక్కడికి వచ్చితిమి. ఆచావడిలోఁ బండుకొంటిమి. దేహబాధకై యావల బోవుచున్న దాన రజోదూషిత నన్నేలముట్టితిరి నేను మీరనుకొనినదానగాను, పో పొండని యదలించి యామె యవ్వలికిం బోయినది.

అప్పుడు వాండ్రిరువురు సిగ్గుపడి నవ్వుకొనుచు నోరీ! యిదియేమిరా? యిట్లు మోసపోయితిమి. నయమే అది భయపడి కేకలు వేసినదికాదు. చుట్టుపట్ల వాండ్రువచ్చి మనలఁ జోరులుగా నెంచి బద్ధులం జేయుదురు మరియుఁ బద్మినీజాతి స్త్రీకి నంత్యయామము ప్రియమైనదన గ్రంధములో నున్నది. దానంజేసి తెల్లవారు జామునఁ దప్పక వచ్చును అని నిశ్చయించి యారేయియెల్ల గనురెప్పవాల్పక వారిద్దరు నాముద్దులగుమ్మకై యెదురుచూచుచుండిరి. ఇంతలోఁ దెల్లవారినది. దిజ్ముఖములవలె వాండ్రముఖములు వెలవెల బారఁజొచ్చెను.

అప్పు డాయోగులు కడువిచారముతో మనోహరదాసునొద్దకుఁబోయి స్వామీ! మీమంత్రమింత గొడ్డువోయినదేమి? అయ్యయ్యో? మూఁడురాత్రులశ్రమ యట్లుండ నిండు. నిన్నరాత్రి మేము పడిన యిడుములకు మేరయున్నదా? తుదకొక విశ్వస్తం బట్టుకొని పరిహాసా స్పదులమైతిమని యాకథ యంతయుఁజెప్పి దుంఖింపఁదొడంగిరి.

వారిమాటలు విని మనోహరదాసు కొంచెముసేపు ధ్యానించి యెట్లైనను దాను కోరిన నారీమణి కులశీలనామంబులు తెలియక జపించినఁ బ్రయోజనములేదు. మీరూరక యాతురులై యడుగుటచే నట్లుచెప్పితిని. పరిచయముగలవారితోఁగాని యట్టి తంత్రము జరుపరాదు. మీమొగమే వా రెరుంగరని చెప్పుచున్నారు యట్లైన నాయోగినితోఁ బరిచయము గలుగఁజేసికాని వచ్చినచోఁ గార్యసాఫల్యము జేయఁ గలను. పో పొండు ఆపొన్ని కొమ్మలను వెన్నంటి తిరగుచుండుఁడని యుపదేశించెను.

వాండ్రు వానియొద్డ నేమియు మాటడలేక యావలకు వచ్చిరి. చిదానందుడు