పుట:కాశీమజిలీకథలు -07.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

కాశీమజిలీకథలు - సప్తమభాగము

చెట్టుకొమ్మకు వ్రేలాడవైచి మిగిలిన శవముల దినుచున్న సమయంబున విరతి వారి జీవములతో నున్నవారిఁగా దలంచి మెల్లనఁ బోయి భూతరాజునకుఁ దెలియకుండ వారి పాదములగట్టులు విప్పి యవ్వలకు సాగనంపినది వారెవ్వరో యెఱుగఁదు వారువెళ్ళు నప్పుడొక యుంగరమా విరతికి గురుతుగా నిచ్చిపోయిరి. ఇదియే యాయుంగరము. అని సభ్యులకది యిచ్చెను వానింజూచి యందఱు విస్మయ మభినయించుచున్నారు. అమ్మరునాఁడే యాభూతరాజు మా యిద్దరిని తన భుజముపై నెక్కించుకొని వచ్చి యీ సింహాసనమునఁ గూరుచుండఁబెట్టి చక్రవర్తినని చాటించి తన నివాసమునకు బోయెను.

భూతపత్ని నావృత్తాంతమడిగినప్పుడే నాకంతయుస్ఫురించినది. మతి యధాగ తము వచ్చినది. మునుపుగలిగిన గరువ మంతయు నటమటమై పోయినది. నాఁటి సుతనే నీరాజ్యము పాలించుచుంటిని చంద్రగుప్తుఁడు నాకు మామగారు సుకుమా రుఁడు తోడియల్లుఁడు రతి వదినగారు ధర్మరతిం దిరస్కరించి కామక్రోథాదులు మనుష్యుని కవశ్యముండవలసినదనియుఁ బురుషకార్యమె ప్రధానమనియు వాదించు టచే నిట్టి యిడుములం బడిరి.

అల్పుఁడన చంద్రగుప్తుని పెద్దకుమారుఁడు లవుఁడు లవశబ్ధమున కల్ఫార్థ మున్నది కావున నట్టిపేరు పెట్టుకొనియెను. అతఁడు కడు మంచివాఁడు. అంతర్ము ఖుఁడు సురస వానిని వరించినది అంగీకరింపమింజేసి యెదురు వానినే అపరాధిగాఁ జెప్పినది. స్త్రీలెట్టి ఘోరకృత్యములకైన సాహసింతురు యమున స్త్రీయే కావున నాగుట్టు గ్రహించినది.

వారిమూలముననే కదా యీ ఘోర సంగ్రామము జరిగినది. దేవవర్మ కడు ధర్మాత్ముఁడు ధర్మము జయింపకపోవునా! అధర్మమెప్పటికి నిలువదు. విశోకుఁ డన్యాయమార్గవర్తి వాఁడు రాజ్యార్హుఁడుకాఁడు. రాజు ప్రజలకు దైవమువంటి వాఁడు. వానియందు దుర్గుణము లేమియు నుండఁగూడదు వికటదంతుడు రాజ పురో హితుఁడై కృతఘ్నుత్వమున నతని రహస్యము బయలుపరచెను. వాని లోకములో నుంచఁదగినదికాదు. కావున మీరెల్లరు సత్యమునకు ధర్మమునకు బద్ధులై పూర్వచార ముల మన్నించుచు రాజ్యములు సేసినచో నుభయ లోకములయందు సౌఖ్యముల నందుదురు. ఇదియే నా వృత్తాంతము అని కన్నుల నానందబాష్పములు గ్రమ్మ నుపన్యసించి పీఠముడిగ్గ నురికిఁ దండ్రియగు వజ్రదత్తునకు జంద్రగుప్తునికి నమ స్కారములు గావించి బావలనాదరించి బంధువుల గుర్తించి యానంద సముద్రములో నోలలాడెను.

అప్పుడు కుశుఁడును సుకుమారుఁడు లజ్జావనతముఖులై వారు గావించిన అక్రమమునకు వగచుచుండిరి. లవుఁడు తండ్రికి నమస్కరింపుచు జనకా! మాత మ్ముడు నాస్థికుఁడు ఇప్పటికైన బుద్ధివచ్చినదేమో యడుగుఁడు, నాఁడు నాతో