పుట:కాశీమజిలీకథలు -07.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యవర్మ కథ

287

నక్రమవాదము గావించెను నాకేమి కొదవ వచ్చినది. విరతి సుగతుం బెండ్లి యాడి నది. అతండు జక్రవర్తియయ్యెను వారిద్దరిని రహస్యముగా నడవికిఁ ద్రోయించెను. అదియే వారి కుపకారమైనది పరమేశ్వరుని విలాసము లెవ్వరి దెలిసికొనఁగలరు? అని యొత్తిపొడిచిన విని చంద్రగుప్తుడు లవునాలింగనము జేసికొని బాబూ మేమందరము జ్ఞాన లవశూన్యులమైతిమి నీవును విరతియు మీతల్లి యజ్ఞానియుక్తులై వై భవంబు బిడసితిర. మీ‌ మాటలయందిప్పటికి నమ్మకము గలిగినది. నీవింటికివచ్చి రాజ్యము గావించుకొనుమని బోధించిన నతఁడు తండ్రీ నన్నీ కుశుఁడు రాజ్యలోభం బున నగరము వెడలఁగొట్టైను. అందులకు నాకించుకయు నీసులేదు మామగారి రాజ్యము నాకుఁగలదు. కుశునికే పట్టాభిషేకము గావింపుఁడని బోధించెను.

అప్పుడు రాజులందఱు సుగతుని స్తుతియించుచు నతని యనుమతి వడసి తమతమ నెలవులకుంబోయిరి. సుగతుఁడు విరతితోఁగూడ జక్రవర్తియై న్యాయం బునఁ బ్రజలం బాలించెను. కుశలవులు దండ్రి యనుమతిని జెరియొక రాజ్యమునకు నధికారులై పాలించిరి.

చంద్రగుప్తు ననుమతిని గుశుఁడింటికి బోయిన వెంటనే పురోహితుండైన వికటదంతుని నడివీధి మంటపములో నిలువంబెట్టి యావీథిని వచ్చుఁబోవువారిచేత వాని మీఁద నుమ్మివేయునట్లు నియమించెను. కృతఘ్నునకు వేరొకనిష్కృతిలేదుగదా? ఆపురోహితుండు కాలథర్మము నొందిన పిమ్మట వానిరూపము శిలయందు జెక్కించి యానడివీధిలో నిలిపి యట్లె యుమ్మివేయించుచుండెను. నీవుచూచినది వికటదంతుని రూపము అతండు కృతఘ్నుఁడై యట్టి యవమానమునకుఁ బాత్రుండయ్యెఁ దెలిసి నదియా అని అడిగిన గొల్ల వాఁడు స్వామీ! తెలిసినది. ఇందలి నీతి లోకులకుబుద్ధిజెప్పు చున్నది. వినుండు కుశుఁడును రతియు లనవిరతుల నాక్షేపించుటచే నత్యంతావమానము జెంది వారిచేతనే కష్టవిముక్తి వడసిరి. కుశుఁడు దుర్మంత్రముజేసి సుగతునితో విరతి నడవుల పాలుచేసెను. అదియేవారి కుపకారమై భూతదంపతులదర్శనలాభంబున మహారాజ్యవై భవము లభింపఁజేసినది. మంచిదినములలో నపకారముజేసినను నుపకార మగుననుసామెత దీన దృఢ మగుచున్నదికదా? దేవవర్మ ధర్మమునే నమ్మి పాలించు చుండుటచే బ్రబలశత్రువు లతనిమీఁదకువచ్చి యగ్గిబడిన మిడుతవలె మ్రండిపోయిరి. రతివిరతి మూలముననే భర్తృమతియైనది. అన్ని దోషంబుల కంటె బెద్దదియగు కృత ఘ్నుదోషము వికటదంతుని జిరకాలము బాధించుచున్నది. ఏపాపమునకైన నిష్కృతియున్నది. కాని కృతఘ్నునికి నిష్కృతి లేదని పురాణములు ఘోషింపు చున్నవి.


శ్లో॥ మిత్రద్రోహి కృతఘ్నశ్చ నృశంసశ్చ నరాధమః
      క్రవ్యాదైః క్రిమిభిశ్చానైర్ణభుజ్యంతేహాతావృశాః॥