పుట:కాశీమజిలీకథలు -07.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ధ్వానములు గావించిరి. చక్రవర్తి వారినెల్లగూర్చుండనియోగించి తాను సింహాసన మలంకరించెను.

అప్పుడు ప్రధాని చక్రవర్తియెదుట దాపుననున్న పీఠ ప్రాంతమందు నిలువం బడి సామంతరాజుల పేరులు జదువుచుండ వచ్చినవారెల్ల జేతు లెత్తుచుండిరి. చంద్ర గుప్తుఁడు అని చదువువరకుఁ బ్రతివచనము వినంబడమిఁ జక్రవర్తి శంకించుచు, నాచంద్రగుప్తుఁ డేమిటికి సభకు రాలేదు? అతనిపీఠము శూన్యమై యన్నదేమి? అని యడిగెను. అప్పుడు విశోకునికి గాళ్ళు గజగజ వడకుచున్నవి.

వజ్రదత్తుఁడు లేచి మహారాజా ! ఆరాజు నాకు మిత్రుఁడు విశోకుఁడనురాజు చంద్రగుప్తు నన్యాయముగాఁ రాజ్యమపహరించి చెరసాలం బెట్టెనని యిదివరకే దేవ రకు విజ్ఞాపనపత్రిక బంపికొని యుంటిని. ఈమహాసభలో నావిషయము విమర్శింతు నని సెలవిచ్చితిరి. ఆ రాజు బద్ధుడై యిచ్చటికిఁ దీసికొనిరాఁబడెను. ఆ తగవే ముందు విమర్శింపవలయు. మహాప్రభూ! అని చెప్పికొనఁగా. జక్రవర్తి కన్ను లెఱ్ఱజేసి, విశోకుఁ డెందున్న వాఁడు? అని కేక పె పెట్టించెను.

విశోకుఁడు పీఠమువిడిచి నిలువంబడి, నేను మహారాజా! అని ప్రతివచన మిచ్చెను. చక్రవర్తి యతని బీఠముదాపునకురమ్మని నీవేమిటికిఁ జంద్రగుప్తునిఁ జెర సాలం బెట్టించితివని అడిగెను. రాజధర్మమున నతని నోడించి రాజ్యము గైకొంటి శత్రువు బ్రబలుడని చెరసాలం బెట్టించితినని యుత్తరము జెప్పెను.

అప్పుడు చక్రవర్తి సోపహాసముగా విశోకా! ఇప్పుడు నేను నీకంటె నధి కుండనై యుంటిని నిన్నుఁ జెరసాలం బెట్టించి నీరాజ్యంబు లాగికొనిన నీరాజు లందరు‌ సమ్మతింతురేమో యడుగుము అది రాజ థర్మమేమో తెలిసికొనుము. అనుటయు నామాటవిని అందున్నరాజులెల్ల నతఁడు అన్యాయముజేసెనేని కేకలు పెట్టిరి.

అప్పుడు విశోకుఁడు మోమున విన్నదనంబుదోపఁ జేతులునలుపుచుఁ చిత్తము. చిత్తము. తప్పుజేసితి రక్షింపుమని వేడికొనియెను. చక్రవర్తి, నీతప్పు పిమ్మట విమర్శింతుము నీవుపోయి యాచంద్రగుప్తుని సపరివారముగా విముక్తుంజేసి యిచ్చటికిఁ దీసికొనిరమ్ము. పొమ్ము. అతఁడు వచ్చుదనుక నేమియు విమర్శింప వలనుకాదు. అని పలికినతోడనే విశోకుఁడు పరుగున బోయి యానృపతి జామాతృ సుత సహితముగా నిగళములు విప్పించి పాదంబులంబడి వేడికొనుచు నాసభకుఁ దీసికొనివచ్చెను.

చంద్రగుప్తుఁడు చక్రవర్తికి నమస్కరించుచుఁ దన పీఠము మ్రోల నిలువఁ బడి మహారాజా! నాసుతుఁడు కుశుఁడును, అల్లుఁడు సుకుమారుఁడు సైన్యములతో వెనుకటి చక్రవర్తికి సంగరమున సహాయమువోయి అందు బ్రహ్మరాక్షసునిచే జ౦పఁబడినవార్త దెలిసి కొని యీక్రూరుఁడు విశోకుఁడు నన్నసహాయనిగాఁ నెంచి దుఃఖ సముద్రములో మునిఁగియున్న సమయంబున నాపట్టణము ముట్టడించి నన్నడ