పుట:కాశీమజిలీకథలు -07.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వికటదంతుని కథ

279

సుకుమారుండు మీసముపైఁ జేయివైచుచు నేమీ అనదులవలె శత్రువులకోడి మనమీవిపినముల వసింపమా! యెంతమాట బలికితిరి. చతురుపాయముల వినియోగించి యెట్లోరాజ్యము సంపాదింపక విడుతుమా పదుఁడు. పదుఁడు. ప్రచ్చన్నముగా నగర మునకరిగి మర్మముల నరసి సమయమెఱిఁగి వైరిం బరిభవింతమని చెప్పిన నామాటఁ గుశుఁడును రతియు బలపరచిరి.

ఆమాటవిని రాజు అయ్యో మనకు బలములులేవు ఆయుధసాధనములు శూన్యము ధనహీనులము శత్రువుదుర్గముల గట్టిపరచికొని యాక్రమించియుండెను. మనలందెలిసె నేని బలవంతమున జంపింపకమానఁడు. అంతయేలవచ్చె. వనంబులఁ దపంబు సేసికొని సుఖంబుగఁగాలము గడుపరాదా! అనిచెస్పిన విని కుశుఁడు తండ్రినాక్షేపించుచు నిట్ట నియె

మాతల్లి వేదాంతము నీకును వచ్చినదికాఁబోలు వనవాసక్లేశము లనుభవించి

తొల్లి పాండుసుతులు రాజ్యము సంపాదించుకొనలేదా? మాకుబలము లేకున్న బంధు వుల నాశ్రయించి సేనలంగూర్చుకొందుము. మిత్రుల నాశ్రయింతుము అని చెప్పి తండ్రి నొప్పించెను. క్రమంబున నరణ్యములుదాటి పర్వతముల నతిక్రమించి యొక నాఁడు వేకువజామునకుఁ దమరాజధానికింబోయి మారువేషముతో వికటదంతుండను పురోహితునియింటికిబోయి తమ్మెఱింగించి కొన్నిదినములు మీయింట వసింతుము తావిమ్మని కోరికొనిరి.

వికటద౦తునికథ

వికటదంతుడను బ్రాహ్మణుఁడు కడుదుర్మార్గుఁడు. కృతఘ్నుఁడు. రాజువలన ననేకదానములంది గొప్పవైభవముతో నొప్పుచుండియుఁ గ్రొత్తరాజు నాశ్రయించి యున్నకతంబున నిట్లనియె.

మిమ్ము నాయింట దాచితినేని విశోకునికిఁ దెలియక మానదు ఎఱింగిన భార్యా పుత్రాదులతో నన్నతఁడు నాశనముచేయకమానఁడు తనకుమాలినధర్మముండదుగదా? మీపుణ్యము. మీరు మాయింట నుండవీలులేదు మఱియొకచోటికిం బొండని యుత్తరము జెప్పెను.

ఆమాట విని కుశుఁడు నీవు మావలన ననేకోపకారములు పొందితివి. ఈ మాత్రము సదుపాయము చేయలేవా? నీకేమియు భయము రానీయము. పదిదినములు చోటిమ్ము నీమేలు మరువమని యెంతబ్రతిమాలినను నాబ్రాహ్మణుఁడు అనుమతింప లేదు. వేగ మవ్వలికిఁ బొండని తొందర పెట్టెను.

వానికృతఘ్నతకు మిక్కిలి యక్కజమందుచు వారు మఱియొక మిత్రునిం టికింబోయి తమ్మెఱింగించి కొన్నిదినములు నిలువనెలనిమ్మని కోరికొనిరి.