పుట:కాశీమజిలీకథలు -07.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుశసుకుమారుల కథ

277

కొని మాకు నాజన్మ శత్రువైన విశోకుఁడను రాజు మానగిరిపై దండెత్తి మమ్ముఁ బారదోలి రాజ్యమాక్రమించుకొనియెను తద్భయంబున బురము వెడలి యేకాంతముగా అడవులంబడి పోవుచుంటిమి ! నాపేరు చంద్రగుప్తుఁడు ఇది నా భార్య థర్మరతి. ఇది నా కూఁతురు. మీరూపములు జూడ మావారి పోలికగానున్నవి. మీవృత్తాంత మెఱింగింపుఁడని పలికిన వారిద్దరు నేలంబడి మూర్చిల్లి అంతలోఁ దెప్పరిల్లి హా! మీకెంతకష్టము వచ్చినది. అయ్యో ? మేమే వారము మీరూపములు మారిపోవుటచే మిమ్ము గురుతుపట్టలేక పోయితిమి. మేము జావలేదు. దైవికముగా బ్రతికితిమి ఇంటికి వచ్చుచుంటిమి. దారిలో మీరు గనంబడితిరని నొడివినఁ జంద్రగుప్తుఁడిట్లనియె

మిమ్ము బ్రహ్మరాక్షసుఁడు భక్షించెనని మాకుఁ జక్రవర్తి జాబువ్రాసెనుగదా! మీరెట్లు బ్రతికితిరి ? నాకేమియు నమ్మకములేదు మీకథచెప్పి నమ్మించుఁడని అడిగిన వాండ్రిట్లనిరి.

అమ్మహా ఘోరసంగ్రామములో నిలువరించి కుశుఁడును నేనుతురగారూఢు లమై పోరుచున్న సమయంబున నొక మహాభూతంబభూత సాథ్యసావహంబగుచు వచ్చి సైనికుల గబళములభాతి మ్రింగుచు రధికుల నేరి చదియగొట్టి గదులుగట్టి మెడపై వేసి కొని బిట్టచివరఁదను నెలవునకుఁ దీసికొనిపోయి అందొకచెట్టు కొమ్మకు మా గుడిదగిలించి యితర శవముల రక్తమాంసముల భార్యతో నారగింపుచు నాట్యము సేయుచుండెను. మాకాయుశ్శేష ముండబట్టి వాఁడుమమ్ముజావగొట్టినను మా ప్రాణ ములు దేహమును విడిచినవికావు గిలగిల గొట్టుకొనుచుఁ గొమ్మల వ్రేలాడుచుంటిమి. పుణ్యాత్ములన్నిచోట్లను గలరు. అందొక చిన్నది మాపరితాపము చూచిమెల్లగ వచ్చి మాకాళ్ళకట్లు విప్పి అవ్వలికిఁ బొమ్మని సంజ్ఞ జేసినది. అట్టి మహోపకారము గావించిన అమ్మించుఁబోణి కేదియేని యుపకారము చేయవలయునని తలఁచి నాచేతియుంగరమిచ్చి కోమలీ! మేమొక దేశమున కధికారులము నీకతంబునఁ బ్రతికి తిమి. నీవెవ్వతెవో తెలియదు నీకుల శీలనామంబులు వినుట కవకాశములేదు. నీవెన్నఁ డైన దెరపికి వచ్చినచో మాదేశమునకు రమ్ము. ఈయుంగర మానవాలిమ్ము దగిన మేలు గావింతుమని చెప్పుచు అందు నిలిచినవాఁడు దడవఁగలడని వెరపుతో డొంక డొంకల సందు నడంగి వడిగనీవల బడితిమి మృత్యు ముఖంబు దాచినట్లుగా సంతో షించుచు అది ఏదేశమో తెలియక అరయుచుఁ గొన్నిదినములకు నాప్రాంతమందలి యొక పల్లెజేరతిమి.

ఆ రాక్షసునిచేతి దెబ్బతో యమలోకము జూచివచ్చితిమి రక్తమాంసములు క్షీణించినవి. నడువశక్తి లేకున్నను నాభూతిభీతిచే నెట్లో అడవి దాటితిమి. అక్క