పుట:కాశీమజిలీకథలు -07.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుశసుకుమారుల కథ

275

రుల పేరులు వ్రాయబడిన పత్రిక యొకటి కోటగోడకు నంటింపఁబడియున్నది. ఆయా సామంతరాజులకుఁ తెలియజేయుడని చక్రవర్తియాజ్ఞ యిచ్చియున్నాడఁట. (డగుత్తికతో) నాపత్రికలో మనవారి యిద్దరి పేరులు వ్రాయఁబడియున్నవి స్వామీ! మేమనాధలమైపోతిమి మహారాజా! అని చెప్పి దుఃఖించిరి.

ఆవృత్తాంతము విని వారి మరణమునకు వగచుచు అపర సంస్కారములు గావించెను.

అని యెఱింగించి....ఇట్లని చెప్పఁదొడఁగెను.

140 వ మజిలీ.

కుశసుకుమారులకథ

అయ్యో? కాలమా ! నాకెంత చెడ్డదానవైతివి. మదీయ చరణసఖపసారిత కిరీటుం డగు విశోకునిచేత గాందిశీకునిఁగావించి భార్యాపుత్రికలతో నన్నిట్లువనములపాలుగావి౦ తువా? హావిశోకా! బాహు బలవిజిత సకల నృపకుమారుండగు సుకుమారుండును నిర్వ క్రమ పరాక్రమ వివశుండగు కుశుండును బ్రహ్మరాక్షషసునిచేఁ జంపఁ బడుటంబట్టిగదా? నన్నిట్లు రాజ్యభ్రష్టుని గావించి పురినుండి వెడలఁగొట్టితివి. అక్కటా కుసుమసుకు మారవతియగు రతియు అత్యంతమృదుగాత్రియైయొప్పు ధర్మరతియుఁ గాళులు పొక్కులెక్క నూర్పుల నిగుడింపుచు నడుగామడ పడపునశ్రమయడర నడుచుచుండు నిడుము జూచి నాయెడదకడు చిదుములై పోవుచున్నదిగదా: సీ! నావంటి అభాగ్యుఁ డెందును లేఁడు కొడుకు లిరువురుం బోయిరి. అల్లుళ్ళు గంతుగొనిరి. రాజ్యంబు శత్రు నృపా క్రాంతమైనది. నగరసుఖంబు లాకాశకుసుమంబులై నవి. పరిజనులు వదలిరి. ఆశ్రితులు విడిచిరి జరతలకెక్కినది. ఇట్టివేళగూడ నేనెట్టి సుఖం బనుభవించుటకుఁ బోవుచుంటినో తెలియదు. ఇఁక మరణము కన్న నాకొండు శరణములేదు. థర్మ రతి చెప్పినమాట లానాఁడు తలకెక్కినవి కావు. ఇప్పుడు స్మరణ వచ్చుచున్నవి. ప్రేయసీ! నాకిప్పుడు మంచిమాటలం జెప్పి యుల్లము నిలువబెట్టుము పుత్రీ! రతీ! నీయవస్థ జూచుచుండియుఁ బ్రాణములుదాల్చియు౦టి నావంటి కఠినహృదయుండెం దైనంగలఁడా యని దుఖించుచు నొక్క చెట్టు క్రిందఁ జతికిలఁబడిన చంద్రగుప్తుని నూరడింపుచు ధర్మరతి యిట్లనియె.

ప్రాణేశ్వరా! కొడుకులును గోడండ్రును గూతుండ్రును మీరు బుట్టినప్పటి కుండిరా ? నడుమవచ్చిరి. నడుమవోయిరి. వారికొరకు విచారమమిటికి ? మొదట నుండియు నేను వారి నస్థిరులుగానే తలంచుచుంటిని. నాకు మునుపుసంతోషమును