పుట:కాశీమజిలీకథలు -07.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మనోహరా! నీవిట్లేల పరితపించెదవు? సంసారము బూటకనాటకమని నేను మొదటనే చెప్ప లేదా? విషయజరసంబులు అంత విరసంబులు కావా! సంబంధులు రుణసంబంధులు కారా! రతియుఁగుశుఁడు సుకుమారుఁడును గపటముజేసి లవుని విరతింబురంబుబాయఁ జేయలేదా? ఆపాతకమూరకపోవునా? విరక్తులగువారి వియోగమున మీకిట్టి చింతయేల గలుగలేదు. ఈరతియుఁ గుశుఁడు యౌవన మదంబున విర్రవీగుచు నామాటలు పాటింపక ప్రపంచకమేనిత్యమనియు, గామక్రోధాదులు జీవికిఁ దప్పక భరింపఁ దగినవనియు వాదించిరి. ఇప్పుడేమైనది? యేదినిత్యము ఇప్పుడు మీకుఁ బ్రపంచక మెట్లున్నది. అసహ్యముగాఁ గనంబడుచుండలేదా? నాఁడేమంటిరి సర్వదా అట్లే తలంచిన పరితాపము గలుగదుగా! ఇప్పుడైన వేదాంతావబోధము గావించుకొని వన౦బునకుఁ బోవుదము రండు. రాజ్యభోగంబుల విడువుడు. ఇదిమనకు దైవము పకారముగానే కావించెనని యుపదేశించిన విని యజ్జనపతి యప్పలుకులు సరకుగొనక నేలంబడి పొరలుచున్న కూఁతునకిట్ల నియె.

పుత్రీ ! నీభర్త సుకుమారుఁ డసమానపరాక్రమశాలి అనియే విజయముగైకొని పేరుపొంది వచ్చుననియుం గుమారు జతజేసి పంపితిని. ఇట్టి అవస్థ పట్టునని యెఱుఁ గముగదా? వట్టి సేనలంబంపిన గాదనువారెవ్వరు? చక్రవర్తి మెచ్చుకొని మాకే కానుకలిచ్చునని మురిసితిని. అయ్యో? యే భాగ్యము పట్టినదికాదు. ఇప్పుడేమి జేయు దును నిన్నెట్లు భరింతును. ఎవ్వరిఁజూచికొని కాలము గడుపుదును మీ అమ్మ వట్టి వెఱ్ఱిది. మాట్లాడిన సర్వము మిధ్య అడవికిఁ బోవుదములెమ్మని పలుకుచుండును. హా ! పరమేశ్వరా? అని విలపించెను.

అప్పుడు రతియు భర్తృసోదరుల గురించి పరితపించుచుఁ జెల్లలిని, భర్తను నిష్కారణముగా అడవులపాలు సేసినందులకుఁ దనకిట్టి కష్టము గలిగినదన నిశ్చ యించి పశ్చాత్తాపము జెందుచుఁ దల్లి కి నమస్కరించి తనకు వేదాంతోపదేశము జేయుమని కోరికొనినది. అభావే విరక్తి యనేమాట నిక్కువముగదా!

వారట్లు దుఃఖసాగరమున మునింగి పరితపించుచుండ మరిరెండు దినములు గడిచిన పిమ్మట మఱికొందఱు వేగులవారు వచ్చి యిట్లు విన్నవించిరి

మహారాజా! ఆభూతమంతటితో విడువక అమ్మరునాఁ డొక యౌవనపురుషుని తీసికొనివచ్చి చక్రవర్తిసింహాసనమున గూర్చుండ బెట్టినది.

కొత్తచక్రవర్తి మిక్కిలి తేజశ్శాలియై యున్నవాఁడట. హతశేషులైనసామంత రాజులు మంత్రులును ఆతనియానతి శిరసావహించి కార్యకార్యములు చేయుచున్నారు. అతని యాజ్ఞానుసారముగా సహాయము వచ్చి యుద్ధములోఁ జనిపోయిస నృపకుమా