పుట:కాశీమజిలీకథలు -07.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

కాశీమజిలీకథలు - సప్తమభాగము

యౌవన విద్యాధసగర్వములు బ్రతుకరాని యంతయాపద గలిగినప్పు డుఁడు గునని పెద్దలు చెప్పుదురుగదా అప్పుడు రాజు వానిమతి రాజసభావంబు విడచి సాత్వి కంబువహించెదనని సంతసించుచు నాందోళిక మెక్కించి వాని నయ్యోగియొద్దకుఁ దీసి కొనిపోయెను.

యోగి జంగమవేషమువేయించికాని నాయొడకుఁ దీసికొనిరావలదని చెప్పెను. అప్పుడు రాజువెనుక జేయించిన కనకఘంటికయు గాంచన శంఖము పట్టుబొంత జోలియు ధరియింపఁజేసి దీసికొనిపోయి మ్రొక్కించిన ఛీ, ఛీ ఈరాజసవేషము పనికి రాదు బిచ్చమెత్తుజ౦గము వేషము వేయింపవలయునని చెప్పటయు రాజు జేగురుగుడ్డతో గుట్టిన బొంతజోలియుఁ గంచుగంట, శంఖము రుద్రాక్షమాలికలు విభూతిరేఖలు ధరి యింపఁజేసి తీసికొనిపోయి అతని పాదంబులఁబడవేసెను.

అప్పుడయ్యోగి - ఓరీ! నీవెవ్వఁడవురా.

రాజపుత్రుఁడు - స్వామీ! నేను జంగమదాసును.

యోగి - ఈజంగమదేవర జంగమదేవరయేనా.

రాజపుత్రుఁడు - స్వామి! బుద్ధివచ్చినది. అపరాధిని రక్షింపుము. ఐశ్వర్య మదమత్తుండనై దుర్వ ర్తనముల మెలంగితిని. తమ శక్తిచే నాబుద్ధిజక్కజేసితిరి. సాధు వర్తనముల మెలంగువాఁడ మీదాసుండను గనికరించి పాలింపుమని మ్రొక్కుచున్నాను.

యోగి - ఇప్పుడు నీకు శూలనొప్పియున్నదా.

పుత్రుఁడు - లేదు మహానుభావా! మీపాదరేణువు సోకినంతనే యటమట మైనది.

యోగి -- నీవీవేషముతోఁ గొంతకాలము బిచ్చమెత్తుచుఁదీర్దాటనము గావింపుము. అప్పుడు నిష్కృతిగలుగును. సాధువర్తనుండవై మెలంగఁగలవు పిమ్మట సౌఖ్యము లందగలవు. అంతదనుక నీమతి వివశమైయుండును. పోపొమ్ము.

అని యానతిచ్చి యాయోగి జపవ్యాసక్తుండయ్యెను. రాజు ఎద్దియో ప్రార్దింపఁ బోయెను కాని వినిపించుకొనలేదు. ఆరాత్రియే జంగమదాసు పురమువిడిచి బిచ్చ మెత్తుచుఁ దీర్థాటనముగావింపుచుండెను.

అని యెఱింగించి యాతఁడో శ్రోతలారా! ఆజంగమదాసేయీ వ్యక్తి యని తెలిసికొనుఁడు మీరడుగుటచే నిప్పుడయ్యుదంత మంతయు స్వాంతమున స్ఫురించి నది. నాఁటిసుత నేఁటిదనుక మనసు వివశయై యున్నకతంబున వెఱ్ఱివానివలె బొలంగి తిని. ఒకనాఁడొకపట్టణంబునకుం బోవుచుండ నన్నందలంబులపై నెక్కించుకొని తీసి కొనిపోయియొకరాజు నాకీచిన్నదానినిచ్చి పెండ్లిజేసెను. అదియంతయు నాకుస్వప్న ప్రాయమై యున్నది. అని ఆతండాత్మీయవృత్తాంతమంతయు నెఱింగించెను.