పుట:కాశీమజిలీకథలు -07.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34]

దేవవర్మ కథ

265

తెలిసికొంటివి? ఇట్టి సాహసమేల జేసెదవు. చావునకు సమ్మతించువారుందురా! అని యడిగిన విరతి మరల నిట్ల నియె.

నాచరిత్రము వినుట సే మీకును గొంతవిచారము గలుగును. దానితో మీకేమి పని ఆకలికి క్షణమోర్వలేని స్థితిలో నుంటిరి. ఎవ్వరైననేమి మనుష్యకాంతను మీకు భక్షింపఁదగినదానను వేగ భక్షించి నా దుఃఖమును బోగొట్టుఁడని వేడినది.

అప్పుడు భూతకాంతసాదరముగాఁ జేరదీసి, అమ్మా! నీవుమాయింటి కతిధివై తివి ఎంతయాకలిగా నున్నను నతిధిని భక్షించు పాపాత్ములుందురా? ప్రాకృ తుండైనను అతిధి పూజార్హుఁడు నీవంటి యుత్తమురాలి సంగతి చెస్పనేల? నీవే దియో నాపద నొందియున్నట్లు తలంచఁబడుచున్నది. నీకంఠస్వరము మిక్కిలి మాధుర్యముగానున్నది. నీవుత్తమజాతి యువతివలె దోచుచున్నది. నీవృత్తాంతము జెప్పుమని యడిగినది నీకథజెప్పినంగాని నీ మేని మాంసము మేము ముట్టమని భూత రాజు పలికెను.


శ్లో. భీమంవనం భవతి తస్య పురం ప్రధానం
    సర్వోజన స్స్వజనతా ముపయాతి తస్య
    కృత్స్నాచ భూర్భవతి కాంచనరత్న పూర్ణా
    యస్యాప్తి పూర్వసుకృతం విపులం నరస్య

అప్పుడా రాజపుత్రిక తన చారిత్రమంతయుఁ బూసగ్రుచ్చినట్లు వక్కాణించి అదిగో అతఁడే నాభర్త చెట్టుక్రిందఁ బండుకొని గుఱ్ఱువెట్టి నిద్రబోవుచున్నవాఁడని చెప్పినది. భూతకాంత యయ్యుదంతమువిని యత్యంత విస్మయకృపాపరీతస్వాంతయై తల్లీ! నీవంటి యిల్లాలింజంపి తినుమనుచుంటివా? ఆహా! నీశీలము త్రిలోక జనస్తుత్యమై యున్నది. నీయక్కయు నీయన్నయు నైశ్వర్యమదమత్తులై నిన్నా క్షేపించియడవిలోనికి త్రోసిపుచ్చిరా? కానిమ్ము నవ్విన యూళ్ళెపట్టణంబులు కాకపోవునా? నీతండ్రి యింత కఠినాత్ముడయ్యెనా! రత్నమువంటి నిన్ను ముష్టియెత్తికొనియెడు జంగమునకిచ్చి పెండ్లి కావించునా! ఔరా! యెంతవింత యని వెరగుపడుచుఁ బతింజూచి ప్రాణేశ్వరా? యీచిన్నది కడు నుత్తమురాలని యీమె చరిత్రమే చెప్పుచున్నది. ఈపూతురాలి పాద రేణువు సోకిన మనము పవిత్రులమగుదుము. దీని మగఁడు వెఱ్ఱివాఁడు చెట్టుక్రింద బండుకొని యున్నవాఁడు వానికిమంచి ఐశ్వర్యము గలుగఁజేయవలయు నిందులకుఁ దగిన యుపాయమాలోచింపుఁడు. అని ప్రార్థించిన అతండు బత్నిమాట జవదాటని వాఁడగుట వల్లె యని యొప్పుకొని యందులకుఁదగిన యాలోచనము జేయుచుండెను.

అప్పుడు భూతపత్ని తల్లీ! నీవల్లభుని జూడవలయు అతనివృత్తాంతమెట్టిదో