పుట:కాశీమజిలీకథలు -07.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నీవు మాపై యుద్ధము ప్రకటించితివి మాయందపరాధమేమియును లేదు. దైవమే మాకుఁ దోడుపడును. సన్నద్ధులమై యుంటిమి అని దేవవర్మ సూర్య వర్మకుఁ బ్రత్యుత్తరము వ్రాసెను. ఆయుత్తరము జూచికొని సూర్యవర్మ మంత్రు లతో నాలోచించి దేవవర్మపై యుద్ధము ప్రకటించితి మనియుఁ బ్రతిసామంతరాజు నిరువుర మహావీరులను లక్ష సైన్యమును బంపుమని యాజ్ఞాపత్రికలం బంపెను. తచ్చాసన ప్రకారము రాజులందఱు సైన్యముతో వీరుల నంపిరి.

దేవవర్మయుఁ దమ మిత్రులఁ గొందఱఁ దోడు రమ్మని కమ్మల వ్రాసెను. ఎవ్వరో యిద్దరు ముగ్గురు రాజులు మాత్రము ప్రచ్ఛన్నముగాఁ గొంత సైన్యమును సహాయముగాఁ బంపిరి.

ఇరువాగులును వ్యూహములను బన్ని యుద్ధమునకు నాయత్తపడి యుండిరి. రెండుమూడు దినములలో మహాయుద్ధము జరుగఁగలదు మనకుఁ దృప్తియగు నాహా రము దొరకగలదని భూతరాజు భార్యకుఁ దద్వృత్తాంతమంతయు జెప్పెను.

ఆకథవిని భూతపత్ని అయ్యో ? పాపము దేవవర్మ బలహీనుఁడగుట శత్రువు నకు లొంగిపోవును కాఁబోలు, న్యాయమితనిదేకదా? ఇవిరో యేరాజుగాని నీదన్యా యము. యుద్ధము జేయఁగూడదని మందలింపక సూర్యవర్మ కోరినంతనే బలములఁ బంపదగునా! ఇది ధర్మవిరుద్ధము ధర్మవిరుద్దమని పలుకగా భూతరాజు మనకేది విరుద్ధమైననేమి? పూర్తి యదు నాహారము దొరుకుచున్నదిగదా! అబ్బా యీ కడుపు మంట నేను భరింపజాలకుంటినిగదా. అయ్యో ఇంకను రెండుయామములై న కాలేదే? ఎప్పుడు తెల్లవారును. ఎప్పుడు ప్రొద్దుగ్రుంకును మరలనెప్పుడు ఆహారము దొర కును. అని యాఁకట వేగుచుండ నతని భార్య అయ్యో? నీబాధ నేను జూడలేకుం టిని ఆహారమేదియుం దొరకదు నే నేమి జేయుదును. అని పరితపించుచుండెను.

వారి సంవాదమంతయు విని విరతి నిరతిశయ దయాకలితహృదయయై పాపము ఈ భూతదంపతులు ఆహారములేక మలమల వేగుచున్నారు. నేను వీరి కాహారమైతినేని నాజన్మసాద్గుణ్యము నొందును. నేను బ్రతికి యేమిజేయుదును. అని తలంచి మెల్లగ లేచి వారియెదుటకు వచ్చి నమస్కరించుచుఁ బిశాచభాషతో నిట్ల నియె.

ఓ భూతదంపతులారా ! మీరు ఆకలిచే మిక్కిలి బాధపడుచున్నారు. నేనొక మనుష్యకాంతను దైవికముగా మీటెంకికరుదెంచితిని. నన్ను మీరు భక్షించి మీయా కలి యడంచికొనుఁడు. నేను గృతార్దురాల నగుదును. భూతతృప్తి జేయుటకన్న నుత్తమపుణ్యములేదు. అని బలికిన ఆ దంపతులామె దిక్కు మొగ౦బై యబ్బుర పాటుతో నెగాదిగజూచి నీవెవ్వతెవు? ఇవ్విపినంబున కెట్లు వచ్చితివి? మాభాష యెట్లు