పుట:కాశీమజిలీకథలు -07.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవవర్మ కథ

263

ఇది మొదటితప్పుగాఁ తలంచి క్షమించితిమి. తక్షణము నీయల్లు నిచ్చటికిఁ బంపవల యును. అట్లు పంపక యెద్దియో కల్పించి ప్రత్యుత్తరము వ్రాసితివేని నిన్ను మన్నిం పను. నీపైదండెత్తివచ్చి నీపీచమడంచి నీరాజ్యమంతయు మాయధీనము జేసికొందుము. ఇదియే ముమ్మాటికిని శాసనము అని వ్రాయఁబడియున్న పత్రికం జదువుకొని దిగులు మొగముతో నేమియు మాటాడనేరక అప్పుడు యమున యంతఃపురమునకరిగి సఖు లతో సరసగోష్ఠి వినోదముల బ్రొద్దుపుచ్చుచున్న కూతుఁజూచి ప్రీతిపూర్వకముగా సూర్యవర్మ పంపిన సందేశప్రకారమంతయు బోధించి యిపుడు కర్తవ్యమేమి యని అడిగెను.

ఆమె యించుక ధ్యానించి తండ్రీ! మనమా విప్రుల కన్యాయమేమియుఁ జేయ లేదు. చాటుననుండి సురస యల్పునితోఁ బలికిన పలుకులన్నియు వింటిమి అతం డిచ్చిన ప్రత్యుత్తరము గ్రహించితిమి కన్నులారజూచి సురస మహాపతివ్రతయన నెట్లు సమ్మతింతుము అల్పునెట్లు దండింతుము ఈ రహస్యమా రాచపీనుగున కేమి తెలియును. తెలిసి తెలిసి ఆతం డపరాధియనినంతమాత్రమున నల్పుని నతని యొద్దక పరాధివోలె నంపమా? యింతకన్న నవమానమేమియున్నది. ఎప్పటికైనఁ జావు జంతు వులకు విధియైయున్నది. క్షత్రియులకు సంగరంబునం జచ్చుటఁ బరమధర్మము జయించితిమా పేరు పొందుదుమని పలికిన విని దేవవర్మ సవినయముగా యిట్లనియె.

తల్లీ! సూర్యవర్మ చేతిక్రింద నలువదిమంది సామంతరాజులు గలరు అతండు గోరినవారందఱు జతురంగబలముతో సహాయము వత్తురు. మనకు వజ్రదత్తుఁడుతప్ప వచ్చిన మిత్రుడొక్కరుఁడును లేడు. ఉన్నను జక్రవర్తికి వెరచి తోడ్పడరు. కావున మనము జయించుటెట్లు ఓటమియే నిక్కము ఎట్లైనను బోరక తీరదని చెప్పిన విని యమున యిట్లనియె.

దైవము ధర్మమందుండును. ధర్మముగలవానికి జయము గలుగును. బలగ ముతోఁ బనిలేదు. మనకు దైవమువచ్చి సహాయము చేయును. నీవు జింతింపవలదు. యుద్ధప్రయత్నము చేయింపుమని యుపదేశించెను.

అంతలో నల్పుఁడు అచ్చటికి వచ్చెను. అతనితో నావృత్తాంతమ౦తయుం జెప్పిన నతండు సంవర్తసమయ వలాహకంబువోలె గర్జిల్లుచు ఏమి? సూర్యవర్మ కింత కావరమేల గలిగినది. మదీయ పరాక్రమ విధం బెరుఁగఁడు దేవవర్మ యస హాయుండని తలంచి యట్టి వ్రాతలు వ్రాసెను. కాని రణరంగమునఁ బశ్చాత్తాపంబు జెందఁగలడు అని పలుకుచు యుద్ధమునకు సన్నద్ధులమై యుంటిమని జూబు వ్రాయమని పలికెను.