పుట:కాశీమజిలీకథలు -07.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవవర్మ కథ

261

సురస నసత్యవాదినిగా భావించిపలికిరి ఇప్పుడై న నమ్ముదురా? అని అగ్నివర్మ పలు కుటయు నలుక చిత్తంబునం జిలుక యమున మాటలం దలంచి యడంచికొని చిరు నగవు మొగంబున మొలకలెత్త భూసురో త్తమా? మత్తకాశినుల చిత్తంబులు మీకెరుక పడవు.

ఈ యభియోగమున సురసయే యపరాధినియై యున్నది. అసత్యాభియోగము దెచ్చుటచే సురస శిక్షాపాత్రురాలు అయినను లోకమునకు విదితమగు సాక్ష్యము లేమింజేసి సురసను విడిచి పెట్టితిమి అల్పుఁడు నిరపరాధి. వంద్యుఁడు అని తీరుపు చెప్పి అగ్నివర్మాదులఁబొమ్మని యాజ్ఞాపించి అల్పునకు నమస్కరించుచు రాజసదన మునకు సగౌరముగాఁ దీసికొనిపోయి యుచితాసనాసీనుంగావించి యిట్లనియె.

మహాత్మా ! నీబుద్దినై ర్మల్యముఁ విశదమైనది. నీకులము పరమోత్తమముకాక మానదు కారణాంతరమున బ్రచ్చన్నముగ దేశాంతరములు దిరుగుచున్నట్లుతోచు చున్నది. ఏదియెట్లై నను సరే త్రిలోకాభిరామయగు యమున యను నాకూఁతురు నిన్ను వరించినది. ఆమెను నీకిచ్చెదను. రాజ్యముతోఁగూడ స్వీకరింపుము. నాకొక్క రితయే కొమరిత అచిన్నది బుద్ధిబలమున బృహస్పతిని మించియున్నది. నీకులశీలాదులు విననర్హులమేని మాకెరిగింపుము కాకున్నను మాకు సందియములేదు. యమునతోఁగూడ రాజ్యలక్ష్మిం గై కొనుమని ప్రార్దించిన విని అల్పుండిట్లనియు.

దేవా! నేనన్నిట నల్పుండని యెఱింగియు మీరిట్లనుట వింతగానున్నది. ధన బలవిద్యాశూన్యుండనగు నన్ను యమున వరించుట యాశ్చర్యముకాదా? నాయందు వరునందరయఁదగిన సుగుణ మొక్కండును లేదు. లెస్సగా విమర్శించుకొని మాటలాడ వలయు నాకు రాజ్యమును యమునయు నక్కరలేదు. నాదారిం బోవనిండనిన విని దేవవర్మ అల్పుని వినయాభిరతుండై ప్రార్థించి యెట్టకే నతని నొడంబడజేసి యమున నిచ్చి మహావైభవముతో శభముహూర్తంబున వివావాము గావించెను. యమున తన బుద్ధిబలంబున నల్పుని కులశీల నామంబులు దెలిసికొని పరమానంద భరితహృదయై స్మరలీలా విలాసాంబువిధి నోలలాడుచుండెను.

కొన్ని దినములుగడచినంత నొకనాఁడు దేవవర్మ పేరోలగమున్న సమయం బున సామంతచక్రవర్తియగు సూర్యవర్మ యొద్దనుండి యొకదూతవచ్చి సందేశపత్రిక యేదియో యందఁజేసెను. ఆ పత్రికవిప్పి ప్రధాని రాజు విన నిట్లు చదువుచున్నాడు.

నరమృగ పశుపక్ష్యాదులలో మనుష్యు లుత్తములు. అందు బ్రాహ్మణులు పూజ్యులు అందువిద్వాంసులు వందనీయులు అందు శ్రోత్రియులు పరమోత్తములు దేవయజనకాపురస్థుఁడా పరమశ్రోత్రియుఁడగు నగ్నివర్మకూతురు సురస ఆజన్మ