పుట:కాశీమజిలీకథలు -07.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33]

యమున కథ

257

అల్పుడు కొంత సేపామెదెసఁ జూడక సారెసారెకు జీరుచుండ విసిగి తలయెత్తి యిట్లనియె. తల్లీ! నీవు బ్రాహ్మణివి. గురుపుత్రికవు. పరకాంతవు తుచ్చ భోగములకాశించి శీలమేమిట బాడుజేసికొనియెదవు ఇంతవరకు శుద్దురాలవని యెల్లరు జెప్పుకొన నొప్పి యిప్పుడీ తొందరయేమిటికి? మలమూత్ర పూరితమై మేదో మాంసరుధిరాస్తి నికాయంబగు నీకాయంబునఁ జక్కఁదనంబున నేమియున్నది. వస్తుతత్వం బింత విచారించిన నీమదియిట్టి చంచలము నొందదుగదా! నీభర్త విద్వాం సుఁడు రూపవంతుఁడు కులీనుఁడు యౌవనవంతుఁడు నీశృంగారలీలలన్నియు నతని యందుజూపక నిరయహేతువులైన చెయ్వులకుఁ బూనితివేమిటికి? చాలుఁజాలు చిత్తము మరలించుకొనుము మరణమైనను నంగీకరింతునుగాని దుష్కార్యమునకు నొడంబడనని పలికిన నక్కలికి పండ్లు పటపట గొరుకుచునిట్లనియె.

అల్పుఁడా? నీవు నీబుద్ధికి సరిసడిన పేరు పెట్టుకొంటివి. నీవు చదివితివిగాని అనుభవము లేదు. వినుము.


శ్లో. అభికామాం స్త్రీయంయచ్చగమ్యాం రహీసి యాచితః
    నోపైతి నచ ధర్మేషుభ్రూణహత్యుచ్య దేబుధైః

అత్యంతాసక్తితోఁరహ్యస్యమందు దన్ను వరించి యాసించివచ్చిన స్త్రీని బొందక నిరసించిన పురుషుఁడు భ్రూణహత్యను బొందునని ధర్మ శాస్త్రములలోఁ జెప్ప బడియున్నది నీవు నాచిత్తము నుత్సాహాయత్తముగావింపుము. దానంగలుగు దోషము నిన్నుఁ బొందకుండ నేనుభరించెదను. విరక్తుల మాటలాడకుము. రసా భావము చేయకుము నన్ను రక్షింపుము. అని మిక్కిలి దీనత్వమున ప్రార్థించిన నతండిట్లనియె.

అమ్మా! నీవు జదివిన శ్లోకమునకుఁ నర్థమదికాదు గమ్యాం అని యున్న పదమున కర్దమేమి? పొందదగిన‌ యువతి అని అర్థము నీవు నాకు గమ్యవెట్ల గుదువు కావున నీబుద్ది మరలింపుకొనుమని యుత్తరమిచ్చిన నచ్చిన్నది నవ్వుచు నిట్లనియె.

సౌమ్యా ! నేను జదువురాని దాననుగాను గమ్యాం అనగా ముసలిది. రోగము గలది. అందములేనిది. ఈలాటి దుర్లక్షణములు గలస్త్రీ గమ్యగాదు గనుక గమ్యాం అని వ్రాసినాఁడు. గమ్యాం అనగా అందమైనది యౌవనవంతురాలు తనకంటె జిన్నది. తనకునన్నిటకు సరిపడినది. అని అర్ధము అట్టి దానను నేనుగానా? నావిద్య పాటవము నీకుఁ తెలియదు నన్నుఁ దిన్నగాఁజూడనే చూడవు. నాసౌందర్యము నీకెట్లు తెలియు మఱియును.