పుట:కాశీమజిలీకథలు -07.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

కాశీమజిలీకథలు - సప్తమభాగము


శ్లో. రాజ్యే సారం వసుధా వసుధాయా మపిపురం పురె సౌధం
    సౌధె తల్పం తల్పె పరాంగనాంగ సర్వస్వం
    సంసారె సురతం సారం సర్వలోక సుఖప్రదం
    తన్న కుర్వంతి యెమూఢా సైనరాః పళవః స్మృతాః.

రాజ్యమందు సారమైనది భూమి. భూమియందు సారమైనది పట్టణము. పట్టణమందు సారమైనది మేడ. మేడయందు సారమైనది తల్పము తల్పమందు సార మైనది నిండుజవ్వనమందుండి సర్వావయవ సుందరిఅగు పూవుబోణి అంగసర్వస్వ మని చెప్పఁబడియున్నది. సంసారమునకు సారము సురతము. అనుకూలమగు దాంపత్యము కుదిరిపంగాని అదిసురస మనిపించుకొనఁదు. ఇప్పుడైనం దెలిసినదా? అని అడిగిన విని ఆతండు చెవులు మూసికొని నీవింతచదివితివే నిన్ను శృంగా రసలాలసవు కావని యెల్లరు జెప్పుకొనుచున్నారు నీభర్త చక్కనివాఁడు. గదా! అతనియం దేమిటకివిరక్త వైతివి సన్యాసిని నన్నేలగామించితివి అనుటయు నయ్యువతి అతనిని మెచ్చుకొని లెస్సగా నడిగితివి. ఇందులకు సమాధానము చెప్పవలసినదే విను౦డు.


శ్లో. హరణీశశయోర్యోగె బడబావృష యోస్త ధా
    హస్తినీ హయయౌశ్చైవ రతం సమరతంత్రయం.

అని వాత్స్యాయన మహర్షి వ్రాసిన విషయము మీరెఱింగియే యుందురు. అందు మాకు జాతిస్వభావ కాలాదులవలన వైషమ్యము గలిగినది దానంజేసి నాభర్త యెంతచక్కనివాఁడైనను నాకనుమతింపఁడు. నీవనుమతించితివి. కావున నన్నుఁ బరిగ్రహింపుము. అని కోరిన నతం డిట్లనియె.


శ్లో. నిరయమున వైచికాల్చినఁ
    జెరసాలం బెట్టికొట్టి చీల్చినగానీ
    పరకాంతఁ గూడనొల్లను
    తెరవా! యిది మంచిసతుల తెరవా? చెపుమూ?

నీవునాకుఁ తల్లివి. నీకుఁ బదివేల నమస్కారములు గావించుచున్నాడ నన్నిఁక బల్కరింపకుము నీ నేరమేమియు నెఱింగింపక రాజుగావించు శిక్షకుఁ బాత్రుండ నయ్యెద నవ్వల బొమ్ము అని పలికి పెడమోహము పెట్టి మాటునకుం బోయెను.

అప్పుడప్పఁడతి లజ్జాక్రోధవిషాదమేదురహృదయయై యేమియుం జేయఁజాలక భుజంగియుంబోలె రోజుచు నవ్వలబోయి వాని నెట్లైన కఠినశిక్షకుఁ బాత్రునిగా జేయఁదలంచి అ౦దులకుఁదగిన కల్పనలనాలోచించినది. ఇంతలో సాయంకాల