పుట:కాశీమజిలీకథలు -07.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యమున కథ

255

మనమేల ధ్రువపరచరాదు. అని యడిగినఁ గుమార్తెదండ్రీ అంతదనుక సురస నియమవంతురాలే వానింజూచినతోడనే తత్కాలమున దాని మనసు తిరిగియుండ వచ్చును. కావలసిన నీకు బ్రత్యక్షమ జూపెద నేజెప్పినట్లు చేయింపుమని చెవులో నేదియో జెప్పినది. రాజు మిగుల సంతోషించుచు అప్పుడ కొల్వుకూటమునకుఁ బోయి మంత్రులతో నాలోచించి వాది ప్రతివాదుల రప్పించి అందరు వినుచుండ రాజ శాసన ప్రకారము ప్రధానమంతి అగ్నివర్మకిట్ల నియె.

విప్రోత్తమా! మీరు తెచ్చిన తగవులో నిదమిద్దమని నిరూపించుటకు నాలో చింపవలసియున్నది. కావునఁ బదిదినములు మీరందఱునిందే యుండవలయును. మఱియు సురసయు అల్పుఁడును నీపది దినములు నొరులుతో మాట్లాడఁగూడదు. పగలెల్ల వారింజెరియొక గదిలోనుడిచి యొరులతో మాట్లాడకకుండఁ జేసెదము. రాత్రులు వారియిష్టమువచ్చినట్లు పోవవచ్చును. అది బందీగృహము కాదు. దివ్యభవనము ఆప్రాంతమందై నను నితరులుండ గూడదు. ఈ పది దినములు గడచిన పిమ్మటఁ తీరుపు జెప్పుదురు అంతదనుక గడు వేరుపఁబడినది అని యుపన్యసించిన విని అగ్నివర్మ కొపోద్దీపితమానసుండై యిట్లనియె.

దేవా! అపరాధుల శిక్షించుట న్యాయముగాని అనపరాధులనుగూడ నిర్భంధ ముంచుట న్యాయవిరుద్ధముగాదా? అల్పుని నిర్భంధవాసములో నుంచుఁడు సురస నుంచఁగూడదని చెప్పుచుండగనే రాజభటు లితని గెంటుకొనిపోయిరి. యేమిచేయుటకు శక్యముగాక తుదకట్లుచేయుట కంగీకరించి పూడకాపుగా సురస నప్పటి కింటికిం దీసి కొనిపోయెను.

మరునాఁడు రాజపురుషులు సురసను సగౌరవముగా బండిపై నెక్కించి యొక భవనంబునకుఁ దీసికొనిపోయి లోపలఁ బ్రవేశ పెట్టి తలుపులువైచి పోయిరి. ఆయిల్లు మిక్కిలి అలంకార శోభితమై యున్నది. చదుపుకొనుటకుఁ గావలసినన్ని పుస్తకము లున్నవి తినుటకు నాహారపదార్థములు గలవు గాన సాధనములు గలవు. రత్న పీఠ ములు, డోలికలు పుష్పమాలికలు నెన్నేని బరిమిళద్రవ్యములు గలవు. ఆగదిలోఁ గూర్చుండి సురస గొంతసేపు సంగీతము పాడుచుఁ గొంతసేపు పుస్తకములు చదు వుచు గొంతసేపు డోలికలనూగుచుఁ గొంతసేపందుగల వింతలం జూచుచు వినోద ముగాఁ గాలక్షేపము జేయుచుండెను.

సాయంకాలముకాగానే రాజపురుషులవెంట అగ్నివర్మ బండిమీఁద అక్క డికి వచ్చి పుత్రికం దీసికొనిపోవుచుండును. సురస సంతోషముతో అందుఁగల వినోదములఁ దండ్రి కెఱింగించుచుండును. ఈరీతి రెండుమూఁడు దినములు