పుట:కాశీమజిలీకథలు -07.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అగ్నివర్మ తనయింట భారతము జదువుచుండగాఁ నల్పుఁడను వాఁడువచ్చి వారింటనుండుటయు సురసను వరించి బావియొద్ద బలవంతము జేయుట నల్పుని బలవంతమునగట్టి గ్రామాధికారి యొద్దకు దీసికొనివచ్చి వానియపరాధ మెఱింగిం చుటయు లోనగు విషయంబులన్నియుఁ జదివి వినిపించెను.

గ్రామాధికారి తీరుపు.

వాదిప్రతివాదులిద్దురు చక్కనివారు. యౌవనవంతులు ఇరువురు శృంగారలీలా భిరతులగుట కేమియు సందియములేదు. వాడిమాట లటుండనిండు. అనువాదియగు నగ్నివర్మ శ్రోత్రియుఁడు. అసత్యమాడువాఁడుకాడు. అతని మాటలన్నియు నమ్మఁదగినవియే. మఱియు సురస ఆజన్మశుద్దురాలని గట్టి ప్రతీతి గలదు. ఇన్ని యుం దలంచి యాచిన్నవాని మొగముజూచినంత నాస్వాంతమున వాఁడు నిరపరాధి యని గట్టిగాఁ దోచుటంజేసి పుత్రియపక్షపాతియగుట నగ్నివర్మ అందుకు స్త్రీస్వభా వమగుట సురసయందును దోషమాపాదించుకొని వాని శిక్షించుటకు నిర్ధారణ చేసికొన లేకపోయితిని. అపరాధియగు నల్పునిదెస సాక్ష్యమేమియు లేకపోవుటచేత వాని విడిచి సురసను శిక్షించుటకు వీలుపడినదికాదు. కావున నీయభియోగమున సత్యాసత్యముల నిశ్చయించు సామర్థ్యము నాకు లేకపోయినది. దేవర విచారించి చిత్తానుసారము గావింప బ్రార్దించుచున్న వాఁడ అని వ్రాసి యాగ్రామాధికారి మండలాధిపతియొద్దకా అభియోగమును బంపివేసెను.

అని చదువుటయు దేవవర్మమొగము జేవురించి గ్రామాధికారి యింత బుద్ది సూన్యుఁడయ్యెనేమి? అగ్నివర్మ సత్యసంధుఁడనియు సురస ఆజన్మశుద్ధురాలనియు వ్రాయుచు నల్పుని మొగము జూచినంతనే వాఁడు నిరపరాధియని తోచినట్లు వ్రాసి యున్నవాఁడు వానిదెస సాక్ష్యమేమియు లేదఁట నిరపరాధత్వము మొగమున వ్రాయఁ బడి యుండునా యేమి? ఛీ, ఛీ, గ్రామాధికారి శుద్దబుద్దివిహీనుఁడు శోత్రియపుత్రికం గవయదలంచిన పాపాత్ముని చేతులు తఱిగింపక కాలయాపనముగాఁ బై అధికారి యొద్ద కనిపెనా! చాలుజాలు ఏదీ అల్పుని వాంగ్మూల మెట్లున్నదో తీసి చదువుము. అని చెప్పిన విని బాంత్రి చిత్తము చిత్తమని యాపత్రికనెత్తి యిట్లుచదువుచున్నాడు.

నాకులగోత్రములు నాకుఁ దెలియవు. నాతలిదండ్రు లెవ్వరో నేనెరుఁగను నాజన్మభూమి తెలియదు. నేనొక సన్యాసివంటివాఁడ నాకు నల్పుఁడను పేరు తలిదం డ్రులు పెట్టినదికాదు. నరమృగ పశుపక్షిక్రిమికీటకాదుల కంటె నల్పుండనని తలంచి యల్పుఁడని నేనేపేరు పెట్టుకొంటిని. భారతమువినుచు నీవిప్రునింటఁబదిదినములు నివ సించితిని. ఆ బ్రాహ్మణుని తండ్రి యని పిలుచుచుంటిని. తరువాత వృత్తాంతము నే