పుట:కాశీమజిలీకథలు -07.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఆమాటవిని ఛండవేగుఁడు చెవులు మూసికొని ప్రేయసీ! అట్టిమాట పలుక వచ్చునా? నీ రక్తంబున శరీరము నిలుపుకొని పిమ్మట నేనేమిచేయుదును? ఎవ్వరిఁ జూచి సంతోషింతును? ఇట్టిమాటయెన్నడును బలుకకుము. ఒక రేయికే తాళలేమా యేమి? అని చెప్పుటయు నాభూతకాంత పోనీ! యీయడవిఫలములు చాలగలవు తీసి కొని వత్తునా? అనుటయు నతఁడు సీ! మునులవలె ఫలములుతినమా! అవి జీర్ణము కావు వాని దినిన నాకు నమనము వచ్చును వలదు వలదు. విశ్రమింపుము నీయాకలిమాట యేమి? అందులకు వగచుచున్నాను గదా రెండు దినములెట్లొ దాళుము నరమాంన రక్తసముద్రము పొంగిరాఁగలదు. అప్పుడు కడవలతో రక్తము ద్రావవచ్చును. అని నొడివిన విని యాభూతవనిత యిట్లనియె.

మనోహరా! అట్టి సంతర్పణము మనకెట్లు కలిగెడిది? పుడమి జనక్షయకరమగు నుత్పాత మేదియైనఁ బొడమఁగలదాయేమి అని యడిగిన నతండు కాదు కాదు. ఒక తరుణి మూలముగా నిరువురు మహారాజులు సంగరమున కాయత్త పడు చున్నారు. ఉభయసైన్యములు వ్యూహములఁబన్నియున్నవి. ఎల్లి శుభముహూర్తంబునం గలియఁ బడఁగలవు వేనవేలు జనులు చత్తురు మనకుఁ గావలసినంత రక్తమాంసమేదస్సంచ యము దొరకగలదు! అని నోరూరఁ గంతులువై చుచుఁ జెప్పుటయు భూతకాంత మగనిహస్తములు గైకొని సంతోషముతో వింతగా నాట్యము చేయఁదొడంగినది. ఇరువురు కొంతతడవు గంతులువైచి కూర్చుండిరి.

అప్పుడు భార్య భర్తతో మనోహరా! ఆహారములు లేకపోవుటచే నేఁడు మన కేమియుఁ బనిలేదుగదా ఒక యువతి మూలమున రాజులు పోట్లాడుచున్నారని చెప్పి తిరి. అకాంత యెవ్వతె? ఏమిటికిఁ బోట్లాడవలసివచ్చినది? ఆరాజులెవ్వరు? వివర ముము నాకథ యెఱింగింపుడు సావధానముగా నాకర్ణించెద నుబుసుబోకున్నదని యడిగిన అతఁడు బోఁటీ? ఇది కడుచిత్రమైనకథవినవలసినదే చెప్పెద వినుము. అని చెప్పఁదొడంగెను.


134 వ మజిలీ కథ

సురసకథ

దేవయజసమను అగ్రహారమున అగ్నివర్మయను బ్రాహ్మణుఁడు గలడు. అతండు వేదవేదాంగములం జదివి విధిక్రమంబున అనేక యాగములుజేసి శ్రోత్రి యులలో నుత్తముఁడని పేరుపొందెను. అతనికి లేకలేక సురసయను కూఁతురొక్క రితి వార్థక్యంబున నుదయించినది ఆ చిన్నది మిక్కిలి చక్కనిదగుట దగిన వరుని కొఱకు అగ్నివర్మ అధిక ప్రయత్నము జేసిజేసి విద్యారూప యౌవనధన సంప