పుట:కాశీమజిలీకథలు -07.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంగమదేవరకథ

237

తలంచుచు విరతిలేచి నాలుగడుగులు దూరము నడిచినంతఁ గొంతదూరములో సుగ తుఁడు తనకభిముఖముగా వచ్చుచున్నట్లు గహించినది.

ముక్కుపై వ్రేలిడుకొని జగదీశ్వరా ! వింతలపై వింతలుచూపుచుంటివే మాశుద్ధాంతమే కాంతారమైనదా! మాతల్లియేది? ఆమెయే ఈమాయ నాకుఁ జూపు చున్నదా. ఏదియెట్లయినను సరియే చూచుచుండెదనని తలంచుచుండ నతండు ఆమె దాపునకు వచ్చెను. అతండు మంగళసూత్రము కట్టుటయేకాని అంతకుమున్నామెతో మాట్లాడియుండలేదు. కావున బెదరుగదుర రాజపుత్రీ మనమిక్కడికెట్లు వచ్చితిమని యడిగెను. ఏమో తెలియదు భగవంతుని విలాసమని హస్తసంజ్ఞ చేసనది. కాని యేమియు మాటాడలేదు. ఆసన్న గహ్రించి యతండు మరుమాటపలుకక యామెతో నడుచుచుండెను. పోయినకొలది మహారణ్యమేకాని తెరిపి యేమియుఁ గనంబడలేదు గ్రామసంచార యోగ్యములైన పశువులు, పక్షులును, మృగములు నందేమియుఁ గనం బడలేదు. విరతిమతి భీతి యున్నట్లేలేదు. విరతి యెటుపోయిన సుగతుం డటుపోవుటయే గాని తాను మార్గదర్శికాఁడు ఇరువురకు సంభాషణలేదు. మూఁగవాండ్రవలె నడుచు చుండిరి. అట్లు పోవంబోవ దినమణి గగనార్థం బాక్రమింప నెండవేడిమి‌ సైరింపక నిలువఁదగునీడతలం బరయుచుండ నొకదండఁదాళ దఘ్నంబైన హ్రదంబొండువారి కన్నులం బడినది.

పిపాసాలసులైన యాదంపతులకు యరసినంతనే జీవనప్రదమైనది జీవన ప్రదమైన నెట్టియానందముగలుగునో తెలియదు. ఆకూపంబు తొంగిచూచిరి జలంబులు లోతుగానున్నవి. అత్తుయంబు ద్రావు నుపాయంబుగానక తొట్రుపడుచున్న సుగతుని దైన్యంబు దిలకించి అక్కలికి యందున్న చిఱితాటియాకుఁ జీరి త్రాడువలెగూర్చి యతని జెంతనున్న గంటత్రిప్పి యుచ్చుబిగించి నీరుతోడి వానికి బోసినది.

అతండు పదిగంటల నీరుద్రావెను. ఆమెయు దప్పిదీరునట్లు జలపానము గావిం చినది. పిమ్మట నానూతిచుట్టు తిరిగి అందలి వింతలం జూచుచుండఁ బిశాచభాషతో నొకశిలపై నీక్రిందిరీతిశాసనము చెక్కఁబడియున్నది. పిశాచభాష విరతి చదివి యున్న౦దున నాశాసనము నందలి విషయంబుల నిట్లు చదివినది.

ఈ ప్రాంతమందున్న కీలకపర్వతమందు ఛండవేగుఁడను భూతరాజుభార్యతోఁ గాపురము చేయుచున్నాఁడు. అతం డర్దరాత్రంబున నిందలి శిలాఫలకంబునం గూర్చుండి మాంసాహారము భుజించి కూపోదకమంతయు దృప్తిగా గొట్టమునగ్రోలె డివి. జలశూన్యమైన నూతిలో మెట్లుగనంబడును. వానిదిగిపోయినఁ బాతాళలోకము నకుఁ బోవుదురు. మరునాఁ డుదయమునకు యధాప్రకారము జలమూరి నూయి