పుట:కాశీమజిలీకథలు -07.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లించినది. మఱియొకనాఁడు కుశుఁడు సుకుమారు నేకాంతముగా జీరి బావా! యీజంగ మదేవర మూలమునమనకపకీర్తి గలుగుచున్నది. ప్రతిసభకు వచ్చిమనతో సమముగాఁ గూర్చుండును. మాతండ్రికి వానియందు బ్రేమగలుగుటంబట్టి యేమాట యనుటకు వీలుపడకున్నది. యీయవమాన మెట్ల యినవదలు నుపాయమాలోచింపవా? అని అడిగిన సుకుమారుండిట్ల నియె.

అయ్యో? నీవు రాఁబోవు ననర్థమెఱుంగక సమానప్రతిపత్తిఁ గలుగుచున్నదని వగచుచున్నావు. వినుము మీతండ్రి విరతికి మగనికి నర్ధరాజ్యము వ్రాసియిచ్చుటకు నిశ్చయించుకొనియెను. మొన్న పండితుల రప్పించి థర్మశాస్త్రములు విప్పించి యా ప్రశంస దెలిపెను. వారు కూఁతున కెంత యిచ్చినను నీయవచ్చునని చెప్పిరి. ఈప్రశం సను నీకుఁ దెలియకుండఁగనే చేయుటకు నిశ్చయించుకొనియెను. లవునిభాగము జంగమదేవరకిచ్చునఁట తెలిసినదియా? అని చెప్పినఁ గుశుఁడ్యువిభ్రాంతుడై యేమీ? మీరాజ్యమవిభాజ్యముగారా? ఒకరికిచ్చుటకుఁ దనలేమి అధికారమున్నది? అందులకు థర్మశాస్త్రములొప్పుకొనునా? అని అడిగిన నతండు చట్టములు చూచియే యిచ్చుటకు నిశ్చయించుకొనెను. అతండిచ్చిన నీవేమియుఁ జేయజాలవని చెప్పెను.

అప్పుడించుక యాలోచించి కుశుండు బావా! ఇందులకు నీవు సహాయము జేయవలయును. ఈపని జరుగకుండ వేరేదియేని యుపాయము జెప్పవలయును. మాయన్న లవుని మాయజేసి దేశాంతరమనిపితిని వీండ్రంగూడనట్లు చేసితిమేని మన కోరిక యీడేరును. ఇందులకుపాయమాలోచించుమని సూచించిన విని సుకుమారుం డిట్లనియె.

నీకుఁదెలియని యుపాయములులేవు అన్నను సాగనంపినట్లె వీరిద్దరిని దేశ ముల పాలుసేయుము. రాజు విరక్తుండై యేమిజేయఁగలడు? రాజ్యమంతయు నీకే దక్కఁగలదని చెవిలో నేదియో చెప్పెను కుశుఁడు మిగుల నానందించుచు నట్లు చేయుటకు సమ్మతించెను.

మఱికొన్నిదినముల కొకనాఁడు విరతి మహారణ్యమధ్యమున నొకచెట్టు కింద బరుండి లేచి కన్నులఁదెరచి ఆహా? ఇదియేమిమాయ అంతఃపురమేమైనది? ఇది కల కాదుగద అడవిలో నుంటినేమి? అని వెరగుపాటుతో నలుదెసలు పరికించెను. సూర్యుఁడు నాలుగుబారలు పైకిఁ బ్రాకెను ఇంకను వరుణకాంతులగానే యుండెను. దిగ్భ్రమజెంది అయ్యబల యోహో ఇది స్వప్నముకాదు. పరమేశ్వరుని యింద్ర జాలము. ఇదియే మహామాయ. యేమైన నాకేమి? వినోదములు జూచెదంగాక పర మేశ్వరుని సృష్టివైచిత్ర్య మమ్మహాత్మునిశక్తి విశేషమును దెలుపుచున్నది. అని