పుట:కాశీమజిలీకథలు -07.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంగమదేవరకథ

235

జేయుదురు? ప్రొద్దుటఁ బురిలోనికి వచ్చునాఁడు చక్రవర్తి కుమారుడగునాయేమి. కానిండు జంగమదేవర మంచివాఁడే పరమేశ్వరుఁడట్టి వేషమునవచ్చి నాకూఁతు నేలఁ దలఁచుకొనెనేమో. యెవ్వరిపుణ్యమెవ్వఱెఱుఁగుదురు? వానికే పెండ్లి చేయుఁడని నతినిష్టురముగా నెత్తిపొడిచినది.

ఈలోపలఁ బరిజనులు రాజాజ్ఞ వడువున సుగతుండను పేరుగల నా జంగమ కుమారుని బల్లకీనెక్కించి నగరిలోనికిఁ దీసికొనివచ్చిరి.

రాజు రతిసుకుమారుల వివాహము మహావైభవముతోఁ గావించెను. విరతికి లోపలనగరిలో గుప్తముగా సుగతునకిచ్చి పెండ్లి జేసెను. అట్టితఱి బంధుగులందఱు కన్నీరుగార్చుచు విరతిని వానికిచ్చిన కారణము తెలిసికొనజాలకపోయిరి. నీమగఁడు జంగము జంగము అని రతియు గుశుఁడును బాలురచేత నాక్షేపణ చేయింపఁదొడం గిరి. మాట మాటకు వెక్కిరింపుచుండిరి. జోగురాలు జంగము వేదాంతులు బిచ్చ మెత్తుకొనుచు దేశాటనము చేసికొనవచ్చునని నిత్యము పరిహసించుచుందురు.

ఆమాటలువిని విరతి యించుకయు మతిజెదరనీయక పాంచభౌతిక వికారమగు కాయమునకు సౌందర్యమననేమి. కులమననేమి? పరమేశ్వరుఁడే భర్త యతఁడే రక్షింపఁగలడు. అని తలంచుచు నొరులకేమియుఁ బ్రత్యుత్తరమీయదయ్యెను.

రతియొకనాఁ డశ్వశకట మెక్కి వచ్చి విరతీ? పూవులతోటకు విహరింపఁబోవు దము వత్తువా? నీమగఁ డెందుంబోయెను? గ్రామముల మీఁది కరిగెనాయేమి? గంట వాయించగలవా? శంకుబూరింతువా? వేదాంతురాలవు. నీమదికి సరిపడిన మగఁడు దొరికెనులే వేదాంతాభ్యాసమున కిదియే ఫలము అని వెక్కిరించిన విరతి నవ్వుచు నీది జవ్వనము క్రొవ్వు. యుక్తాయుక్త వివేకము గలుగనీయదు అక్కా ఈ యౌవనము ఈసంపదలు ఈదేహము జూచుకొని మురిసెదవేమిటికి? ఇవి క్షణభంగురములని తెలిసిన నిట్లు విఱ్ఱవీగవుగదా? అయ్యో అమ్మ పాలుద్రావియు మీరిద్దరు నింత దుష్ట స్వాంతులైతిరేమి? జ్ఞానలవశూన్యులై ప్రాజ్ఞుం నాక్షేపించుచున్నారు. వేదాంతముమీకు హాస్యాస్పదమైనదా అక్కటా? మీకొరకే నేను బొక్కుచుంటి పోపొమ్ము. మగనితో నీవు సుఖించుట నాకుఁ బరమసంతోషము అని పలికిన నులుకుచు నక్కలికి మఱల మఱల నెత్తిపొడుపుమాట లాడజొచ్చినది. ఇరువురకు వాదము జరిగినది.

అప్పుడు రాజపత్ని రతి నాక్షేపించుచు నవ్వినయూళ్ళె పట్టణములగును ఎవరినొసట నేమివ్రాయబడినదో యెవ్వరికిఁ దెలియును? తొల్లి శర్యాతికూతురు సుకన్యయను పతివ్రత శతవృద్దుడైన గ్రుడ్డితపసిం బెండ్లియాడి యింద్రభోగంబుల నందలేదా నిరతియునట్లె సుఖింపఁగలదు నీవు వేగిరపడమని రతి నాక్షేపించి మంద