పుట:కాశీమజిలీకథలు -07.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వద్యుఁడు రతిని వానికిచ్చుటకు నిశ్చయించితిని. అందుల కంగీకరించెను. విరతిని వీర్యవంతుని కుమారుఁడు వత్సుడను వానికిచ్చుటకు నిశ్చయించితిని వీర్యవంతుఁడు మంచిబలశాలిథనికుఁడు పలుకుపడిగలవాఁడు వత్సుఁడతని కేకపుత్రుడగుట గారాముగాఁ బెరిగెను చదువంతగా వచ్చినదికాదఁట. రూప మొకమాదిరిగానుండును. సర్వగుణములు కాంచనమునాశ్రయించి యుండును వాని కేకొదవయును లేదు కావలసినంతద్రవ్య మున్నది. సుముహూర్తము యెల్లుండియే నిశ్చయించితిని ఈవార్తనీకు జెప్పుటకువచ్చి తినని చెప్పినవిని అతనిభార్య సంభ్రమశోక గ్రోధవశయై యొక్కింత తడవూర కొని భర్తతో నిట్లనియె.

మనోహరా! వత్సుని చరిత్రము మీరెఱింగిన నంగీకరింపరు. వాఁడు విద్యా గంథరహితుఁడనియు దుష్క్రియాచరణ నిరతమతిఅనియు ఘాతకుఁడనియు నెల్ల రుం జెప్పుకొనుచున్నారు. సప్తవ్యసనములు వానిపాలఁట. వానియం దొక్కసుగుణ మైన లేఁదట చూచి చూచి రత్నమువంటి పిల్లను వాని కెట్లీయఁదగును? దుష్టునిం బెండ్లి యాడి‌ యిడుములం గుడుచుటకంటె నాబిడ్డ యోగినియై యిట్లే యుండును. పెండ్లి అక్కరలేదని చెప్పిన విని యారాజు వెండియు నిట్లనియె.

కామినీ ! వాని గుణంబులు నీవు విన్నవన్నియు నసత్యములు విద్యలేని లోప మొక్కటియే యున్నది. విరతి వేదాంతురాలుగదా ఎట్లున్నను సవరించుకొనఁగలదు. దేశమంతయు దిఱిగితిని మరియొక సంబంధమేదియును లేదు. అదియునుంగాక వీర్యవంతునకుఁ దరలి రమ్మని శుభలేఖ వ్రాసి యంపితిమి. ఇవ్పుడు వలదన్న నతఁడు కోపింపఁడా? ఎట్లైన నాసంబంధ మంగీకరింపుమని బ్రతిమాలికొనియెను. ఆమె అంగీకరించినదికాదు. ఆవిషయమై భార్యా భర్తలకుఁ బెద్ద సంవాదము జరిగినది. బిచ్చగాని కిచ్చినను సంతోషింతును గాని వత్సునకిచ్చుట కంగీకరింపనని కచ్చితముగా నుత్తరముజెప్పిన రాజిట్లనియె.

కానిమ్ము నీవన్నమాట నిలుపుకొనుము. ఇకసంబంధములకు దేశములు దిఱుఁగ జాలము ఎల్లుండియుదయమునఁ నుత్తరగోపురము దాపునకుఁబోయి తొలుత నెవ్వఁడు వీటిలోనికి వచ్చువాఁడు గనంబడునో వానికి విరతినిచ్చెద నంగీకరింతువా అని అడిగిన నామెతప్పక అట్లే చేయుఁడు దైవమేతీసికొని వచ్చునని పలికినది. ఆమాట వారిద్ద రికింగాక మరియెవ్వరికిందెలియదు.

ఆమాటయే నిశ్చయించుకొని భూపతి అంతఃపురమునుండి యీవలకు వచ్చు నంతఁ గుశుఁడుగలిసికొని తండ్రీ! శౌర్యవంతుఁడిప్పుడే శుభలేక వ్రాసి అంపెను. రేపురాత్రికే వత్తురఁట. విడుదల నెందు నియమింతుము కేయూరదత్తునకుఁ బెద్దమేడ