పుట:కాశీమజిలీకథలు -07.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మినీ గురుదత్తుల సమ్మేళనము

221

నేనీ ప్రజల బాలించి అతఁడు విచారింపవలసిన అభియోగముల విచారించుచుఁ గాలము గడుపుచుంటిని.

రత్నాంగి యను బోగముదాని అభియోగములో మృగదత్తుడల్లిన తివాసి జూచినతోడనే వెనుకటిస్మృతి అంతయు జ్ఞాపకము వచ్చినది ఆ విచారణములోనే పద్మిని జాడయుం దెలిసినది. వాని సాక్ష్యము నెపంబున రప్పించుట కాజ్ఞాపత్రికలఁ బెక్కు వ్రాసితిని. ఇదియే నావృత్తాంతము. దైవానుకూలమున నందఱము చేరు కొంటిమి. పద్మిని పడరాని యిడుములం బడినది. మొన్నటిదాని యవస్థదలంచికొనిన గుండెలు పగిలిపోవుచున్నవి. అక్కటా? గొల్లవానికి బానిసయై నిత్యము పెరుగును నీపట్టణమునకు మోసికొనివచ్చి అమ్ముకొనిపోవుచుండునది. పెరుగు, పాలు, చల్ల అమ్మి మధ్యాహ్నమున కింటికిఁ పోవునఁట. సాయంతనముదనుక నింటిపనులు చేయుచుండెడిది యఁట. కటకటా! ఆమాటలు వినిన నాడెందము చివికిఁ కుళ్ళిపోవు చున్నది. బోగముదానియింట నీళ్ళుమోయుచు వరవుఁడు తనంబున మెలఁగినదట, అని యామెబడ్డ బాములన్నియుంజెప్పిగోలున నేడువఁదొడంగెను.

తనపయ్యెవచేఁ గన్నీరు దుడుచుచుఁ పద్మిని ప్రాణేశ్వరా! అది కాలమహిమ గాక మరియొకటికాదు. దమయంతి, సీత, చంద్రమతి లోనగు రాజుభార్యలకన్న నేనధికురాలనాయేమి చివరకు మేలుచేసిన భగవంతునకు గృతజ్ఞులమై యుండవల యును. గతచరిత్రము స్మరింపవలదు నాకుమారునిఁ జూడవలయునని యున్నది. వేగమురప్పిపుఁడు అని వేడుకొనినది అప్పుడేపోయి గదాధరుఁడు వారిద్దరిం దీసికొని వచ్చి చూపి యన్యోన్యవృత్తాంతములు చెప్పెను.

అప్పుడు వారిహృదయంబుల గల యానంద మిట్టిదని వర్ణింప నాకు శక్యము గాదు. మనసుచేతనే దెలిసికొనదగినది.

ఆ రాత్రియెల్ల నిద్రబోవక తమరుపడిన యిడుములెల్ల నొండొరులకుఁ జెప్పికొనుచు సంతోషశోకము లభినయించుచు నోదార్చుచు దృటిగా వెళ్ళించిరి

సుమేధుడు నాటి ప్రాతఃకాలమునఁ జక్రవర్తియొద్ద కరిగి తన వృత్తాంతమంత యు౦జెప్పి అతని నాశ్చర్యపారావారములో ముంచివేసెను. అతండు కోరినప్రకారము విద్యానగరమునఁ బేరోలగము గావించెను. తన సామంతులనెల్ల నందు రా నియమించి నిండుకొల్వులో గురుదత్తుని చరిత్రమంతయుఁ గాధగా జెప్పి సభ్యుల నచ్చెరువు పడజేసెను.

రత్నాంగి తెల్ల తెల్ల పోయి చూచుచుండెను, రాజు ప్రతినిధి హృదయముకం పింప దొడఁగెను, ఉదయార్కు_ని ముఖపద్మము వికసింస దొడగెను. సామంత