పుట:కాశీమజిలీకథలు -07.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

కాశీమజిలీకథలు - సప్తమభాగము

యేమిచేయుటకుందోచక నేను బడియుండ తొండముచేఁ తడిమి తడిమి యదినన్ను జుట్టి వీపు పైకి విసరినది. ఆవిసురునకు దానిపైనిఁబడితిని. నాకుఁ నేనుగ నెక్కు పాటవము గలిగి యుండుటంబట్టి కాళ్ళను బిగబట్టి మెల్లిగా గు౦భము దాపునకుఁ బోయితిని.

ఆమతంగము నేను తనపైనున్న విషయమెఱిఁగి యుండదనుకుందును వేగముగా అటునిటు తిరుగుచు వృక్షలతాదులఁ దొండమెత్తి విరచుచు వక్కానలో క్కానలో దారుణవిహారముఁ గావించుచుండెను.

పర్వతశిఖరములెక్కుచుఁ బల్లములకు దిగుచుఁ గొమ్మలవిరచుచు నీరీతి చిత్ర సంచారముచేయుచు గ్రమంబునఁ గొండలోయలలోనికిఁబోయినది. నేను దానికంఠము విడువక యొంటిప్రాణముతో నుంటిని.

గజేంద్రవాహనుఁ డను చక్రవర్తికి నేనుఁగుల వేటయందుమంచిపాటవము గలదు. అతండా యడవికి వేటకై వచ్చి బోనులొగ్గియుండెను. అతండొక చెట్టుపై నున్న యతని నెట్లోచూచి వడివడిగాఁ బరిగిడిపోయినది. ఆవృక్షశాఖలు సమున్నత విశాలములై యన్నను అవి యన్నియు విరచి మోడుగావించినది. అప్పుడు గజేంద్ర వాహనుఁడున్న కొమ్మ విరువబూనినప్పుడతండు తనచేతనున్న కఠారి గురిజూచి తొండముపై వ్రేసెను. ఆవ్రేటుతప్పి గండ స్థలముపైగ్రుచ్చికొనినది. నేనాకత్తినందు కొని చేతనమర్చికొనియుంటిని. అంతలో నాశుండాలము గండుకొని తరుశాఖపై నున్న గజేంద్రవాహనుని బడద్రోయఁ బ్రయత్నించుచు నాకొమ్మ విరచి నేలపాలు గావించి యతని తొండముతోఁ బట్టుకొని పైకెత్తి వ్రేయఁబోవు సమయంబున నాచేత నున్న కత్తితో నాతొండము నరికివైచితిని. అట్లుచేయనిచో నప్పుడే యారాజు పిండియై పోవును. రాజు తొండముతోఁగూడ నేలంబడి వివశుండయ్యెను. అంతలో రాజభటులు పలువురువచ్చియీటెలంబొడిచి శరములనేసికరశూన్యమగుట దానినినేలపాలుగావించిరి.

రాజును సేదదేర్చిరి రాజులేచి నన్నుఁజూచి నీవెవ్వఁడవునాప్రాణములుగాపా డితివి. నన్ను రక్షింపవచ్చిన భగవంతుఁడవు. నీవృత్తాంతముఁజెప్పుమని ప్రార్థించెను. నానిజకద చెప్పక వేరొకరీతిఁ జెప్పితిని.

ఆతండు నన్ను దనయందలముపై నెక్కించుకొని తనరాజధానకిఁ దీసికొని వచ్చి ప్రాణమిత్రునిగాఁ జూచుకొని కాపాడుచుండెను. అదియేమియో కాని పూర్వ స్మృతియంతయు నశించినది. కలలోవార్తవలె నున్నది. కొన్ని అభియోగములలో నతనికి సందిగ్దముగానున్న విషయముల నిజముగ్రహించి నేను తీరుపులు వ్రాసితిని. దానుమెచ్చికొని ఆతండు నాకిట్టి అధికారమిచ్చుటయేకాక ప్రాణదాతనను విశ్వా సముతో నూఱుగ్రామములకు రాజుగావించెను.