పుట:కాశీమజిలీకథలు -07.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మినీ గురుదత్తుల సమ్మేళనము

219

మీయభిప్రాయము తెలిసికొంటిని గదాధరత్వము మరియొకని యందారో పించి రూపభేదమునున్నను గ్రియాభేదము లేదని సూచించుచు నాత్మాపరాధము మరుగుపరచ నేతెంచితికికాదా సత్యము జెప్పుఁడని యడిగిన సుమేధునకు గదాధరుం డిట్లనియె.

సుమేధశబ్దము విశేషణపదముగాని విశేష్యపదముగా మీయందుఁ బరిగణింప బడదు, అట్టిమారుపు దేవరయందుఁగలదని అస్మదీయ గురుదత్త వరప్రదానంబునఁ దెలిసికొంటిని. సత్యముకాదా అవసరమును బట్టి భగవంతుఁడు నామరూపభేదంబులు వహింపలేదా? నన్నేమిటికిఁ బరితపింపఁ జేసెదరు? నిక్క మెరింగించి కృతకృత్యుం గావింపుఁడని ప్రార్థించెను.

అప్పుడు సుమేధుఁడు కన్నీరు స్రవింప హా! మిత్రమా! గదాధరా! యింత కాలమునకు గలసికొంటిమిగదా! యని పలుకుచు గౌఁగలించుకొని దుఃఖింపఁ దొడం గెను,

ప్రహర్ష పులకితగాత్రుండై గదాధరుఁడు ఔరా! ఎంత చిత్రము దైవసంఘటన మెంతచోద్యమైనది. అని యూరక యచ్చెరువందుచు నీకిట్టి యౌన్నత్య మెట్లుకలిగి నది? ఇంతకాలము మమ్ముఁ జూడకయేమిటి కుపేక్షించితివి? నీభార్య పద్మిని దేశ ములపై తిరుగుచున్నది నీకుమారునితో నేను గలిసికొని తిరుగుచుంటినని తన కథ యంతయుం జప్పెను.

సుమేధుఁడు, మొన్ననే మిమ్ముల గురుతుపట్టితిని మీమార్పులు నీబుద్ధిబలము చేతఁ గలిగినవని ప్రశ్నించితినికాను దైవోపహతులమగుట నీవియోగముఁ జెందితిమి మంచికాలమున నన్నియు సమకూడును. పద్మినితో మొన్ననే కలసికొంటిని లోపల నున్నది అని యామెంజీరెను సముచితాలంకారధారిణియై పద్మిని వచ్చి గదాధరునికి నమస్కరించి కన్నీరు గార్చుచుఁ దనవడిన యిడుమలన్నియుం జప్పుకొనియెను.

ఆమె నొదార్చుచు నీకుమారునికి నీవువ్రాసియిచ్చిన యుత్తరముచూచి నీవే యని గ్రహించితిని. మీనిమిత్తమై తిరుగుచుంటినని తానుపడిన కష్టములన్నియుఁ జెప్పికొనియె అప్పుడుసుమేధుండు తనవృత్తాంతంబిట్లని చెప్పం దొడంగెను.

గర్భభరాలసయైయున్న ప్రియురాలినివిడిచి కోయలతో గూడఁ విచిత్ర పత్రములకై యడవికిం బోయితి. అందు సర్పదష్టుండనైపడియుండఁ గోయలు నలు మూలలకుం బోయిరి. నేను వివశుండనై పడియున్న సమయంబునఁ నొక యడవి యేనుగ యక్కడికి వచ్చినది. అదినన్నుఁ దొండముతో మూర్కొని మూర్కొవి యాపాదమస్తకము తడిపినది. అప్పుడు సర్పవిషముతగ్గి నాకుఁ దెలివివచ్చినది