పుట:కాశీమజిలీకథలు -07.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28]

పద్మినీ గురుదత్తుల సమ్మేళనము

217

దుర్గానగరమునుండి వచ్చిన రాజభటులు దైవికముగా దారసిల్లిన గదాధర ప్రముఖుల మువ్వురంజూచి వెరగందుచు బాబూ మాకుఁ జీవత హానిదెచ్చిబెట్టితిరి. మీరుగూడ నేఁడేవచ్చితిరి. మీయభియోగమున్నదని మాకు జెప్పితిరికారు. నిన్నను సభ్యులందరు వింతగా మన కథలు చెప్పుకొనుచున్నారు. మీకొరకు వెదకుచుంటిమి. చక్రవర్తి స్వయముగా మన యభియోగములు విచారింతురఁట. ఈవ్యత్యాస ములు దెలిసికొనుటకే యని తోచుచున్నది. సుమేధుడు గట్టిగాఁ బ్రశ్నలు వైచినచో మొన్ననేవెల్లడియగును ఆయన యేమిటికోచల్లగానూరకున్నాఁడు. మాపని యేమిచేయుదురని దుఃఖించుచుఁ బలికిన రాజభటులు నూఱడింపుచు గదాధరుఁ డిట్లనియె.

మాకీవిషయమేమియుఁ దెలియదు. రత్నాంగి తెచ్చిన యభియోగములో మృగదత్తునకు సాక్ష్యమున్నదని మేమెరుఁగము. మేమడవిలో దాగుటకై పోయిన నందీతని బట్టుకొని తీసుకొని వచ్చినారు ఇంతవట్టు నిజము. ఈమార్పు మాకునుఁ ప్రమాదమే ఉదయార్కుని రాజప్రతినిధిగూడ రమ్మని యాజ్ఞాపత్రికలు పంపిరఁట అందులకే విచారించుటకు నాలుగు దినములు వ్యవధియైనది. నిజము వెల్లడియైనచో మనమందరము కారాగారములో నుండవలసిన వారమే భగవంతుని యెత్తి కోలు తెలిసి కొనఁజాలము. కానిమ్ము. రేపు నేను సుమేధునింజూచి యాశీర్వదించి యాశ్ర యింతును. ఆతండు కరుణాళుండని తోచుచున్నది. నిజముచెప్పి తప్పుగావుమని ప్రార్థింపదలంచుకొన్నాను. వానికేమాత్రము పాండిత్యమున్నను రంజింపఁజేసి వశ పరచుకోగలను. అని పలికి వాండ్ర నూరడించెను.

వాండ్రును జేయునది లేక తమ్ము తప్పించుమని గదాథరుని పాదములమీఁద బఁడి ప్రార్థించిరి అతండు వారినూరడించి యామరునాడుస్నానముచేసి యొడలెల్ల విభూతినలఁది బ్రహ్మతేజము మూర్తీభవించునట్లుమెఱయుచు ఫలములందీసుకొని సుమేధునింటికిం బోయెను.

నాలుగు దినములనుండి సుమేధుఁడు ప్రాతఃకాలమున నశ్వమెక్కి. విహరింప నరుగుటలేమింజేసి అప్పుడింటిలోనే యుండెను.

సింహద్వారమున నిలువంబడి వేదముచ్చరింపుచు నాలుగు శాస్త్రములయందుఁ బాండిత్యముగల పండితుండొకండు దేవరదర్శనార్థమై వచ్చియున్నాడని పద్యములతో వ్రాసియిచ్చి వర్తమానమం పెను.


శ్లో. గదాధరారాధన తత్పరోహం
    గదాధరారాధన తత్పస్త్వం