పుట:కాశీమజిలీకథలు -07.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని కథ

19

కొన్నను నామన సటే లాగుచున్నది. దేవసభావిభూషణులైన వసుపులు తమ మానిసి పుట్టుకతెరం గెఱింగిన నెంతవగతురో ! పోనిమ్ము. చెప్పుటయే మంచిది. ఎప్పుడైన శాపమనుభవించి తీరవలసినదేకదా? ముందుగాఁ దెలిసినచోఁ బ్రతీకార మేదియైనఁ జేసికొందురేమో ? తప్పక వేగఁబోయి చెప్పవలసినదే. అని నారదమహర్షి యొకనాఁడు పెక్కు తెరంగుల వితర్కించి దివ్యమార్గంబున వసులోకమున కరిగెను.

వసువు లమ్మహర్షి రాకవిని దూరముగా నెదురువోయి యర్ఘ్య పాద్యాదివిధుల నిర్వర్తించి తోడితెచ్చి యుచితాసనాసీనుం గావించిరి. అప్పుడిద్దరు వింజామరల విసరిరి. ఇరువురు పాదము లొత్తిరి. మఱి యిరువురు పుష్పములఁ బూజించిరి. యొకఁ డాతపత్రము పట్టెను. ధరుండెదుర నిలువంబడి వినయవినమితోత్తమాంగుఁడై యల్లన నిట్లనియె.

ఉ. పావనమయ్యె మాకులము పండెఁ బురాకృతపుణ్యముల్ యశ
    శ్రీ విలసిల్లెఁ గామ్యఫలసిద్ది ఘటిల్లెఁ దపంబునిండె నో
    దేవమునీంద్ర ! నీ వరుగుదెంచుటచే నిటకుం ద్వదంఘ్రీసం
    సేవయొనర్చి యేమిఁక విశేష మదేమి భజించువారమో ?

మహాత్మా ! మీరిప్పు డెందుండి వచ్చితిరి? మూడులోకములలో మీకుఁ దెలియని రహస్యము లుండవుగదా ? ఎందేని విశేషములున్న వక్కాణింపుఁడు. అని అడిగిన నారదుండు వసు ప్రవరా ! నే నిప్పుడు భూలోకమునుండి వచ్చుచుంటిని. విశేషము లన్ని చోట్లం గలవని పలుకుచుండఁగనే ధరుండు వెండియు నిట్లనియె

మునీంద్రా ! మర్త్యలోకము కడు శోకాకులమని మా ప్రభాసుని భార్య చెప్పినది. అక్కడి కష్టము లెట్టివి? ముదిమియఁట యెట్లుండును. ఎన్ని యేండ్లకు వచ్చును. రోగములప్రవృత్తి యెట్టిది ? మనకును వారికినిఁ గల భేద మెయ్యది? తెల్ల ముగ నెఱిగించెద రేయని యడిగిన నారదుం డాత్మగతంబున నయ్యా ! వీరు తమ మనుష్య లోక జననోదంత మెఱుంగక నన్నడుగుచున్నారు. ఉపశ్రుతివలె నాలోక ప్రస్తావమే తేవలయునా ? కొంత ప్రసంగ మైనవెనుక జల్ల గా నెఱింగింతు. తొందర పడరాదని తలంచుచు నిట్లనియె.

మనుష్యులకు దుఃఖాధిక్యమున్నమాట నిజమే వారిభోగములు క్షణభంగురములు. జరా మరణ రోగములు సంతతము బాధించుచుండును. కాని మనకన్న వారి కొక్కవిశేషము గలదు. మనుష్యులు తపంబుచేసి మనకును బొందశక్యముగాని యుత్తమలోకంబుల నందఁ గలరు. అనుటయు ధరుండు స్వామీ ! వాండ్రుత్తమలోకం