పుట:కాశీమజిలీకథలు -07.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

కాశీమజిలీకథలు - సప్తమభాగము

రత్నాకరుని పరిచారకులలోఁ దగినవారి మువ్వుర కప్పలుకులు బోధించి విశేష ధన ప్రదానంబున వారి సంతోషపరచి రక్షక పురుషుల వెంట నామువ్వురిం బంపి వేసెను.

రత్నాకరుఁడు వారిం దనయింటనుండ నిర్బంధించెనుకాని గదాధరుఁడు అంగీకరింపడయ్యెను. మేమిక్కడ నుంటిమేని విదితము కాకమానదు. గుట్టు బయల్ప డె నేని బ్రమాదము గలుగును. కొన్ని దినములు ప్రచ్ఛన్నముగా రహస్యస్థలంబుల వసించి కొలది కాలములో గ్రమ్మర జనుదెంతుమని బోధించి యతని నొప్పించి యిల్లు విడిచి యేకాంతముగా నుత్తరాభి ముఖముగాఁ బోవఁదొడంగిరి.

మనకిప్పుడు గమ్యస్థాన మేదియని యడగిన గదాధరునికి మృగదత్తుండు ఆర్యా ! నేజనించిన కోయపల్లె కడు రహస్యమైనదని మీరు వినియేయుండిరి. మనమక్క డికిఁ బోవుదము. మనల నెరుఁగఁజాలరు. కొన్నిదినములుండి వత్తము. జన్మభూమిజూడ నాకును వేడుకగానున్నదని పలికి అయ్యరణ్యమునకుఁ బ్రయాణము చేసెను.

అతికష్టములపాలై కాలినడక నెట్టకే సమ్మెట్టల నడిభాగము జేరిరి. మృగదత్తుని కొందఱు గురుతు పట్టలేకపోయిరి. గురుతుపట్టిన వాండ్రు చిరుతపులియని కేకలు వైచిరి. ఇంటికివచ్చిన మృగదత్తుని జూచి తండ్రి యేమి‌రా? పెద్దవాఁడవై యింటి యొద్దకురాక దేశముల పాలై తిరుగుచుంటివి. వీఁడెవఁడు? చాపలమ్మినసొమ్మేమి చేసితి వని యడిగిన మృగదత్తుండు వాని పామరత్వమునకు వెరగందుచుఁ గొంతసొమ్ము వానికిచ్చి నాయనా! కారణముండబట్టితిరిగితిని. అమ్మినసొమ్మిమ్మనియే తీసికొనుము. మిమ్మెప్పటికిని మరువను. అని అప్పటికిఁ దగిన మాటలాడి వాని సంతోషపరచెను.

ఆసొమ్ము పుచ్చుకొని వాఁడు మిగులఁ జలఁగుచు బాబూ ! నీకొఱకీనడుమ పదు గురువచ్చి వెదకిరేమిటికి? ఎందోబోయెనని చెప్పితిని. పలుమారు మాయిల్లు శోధించిరి. కారణ మేమని యడిగిన విని నాకేమియుఁ దెలియదని చెప్పెను.

గదాధరుఁడా మాటలు విని శంకించుచు నెన్నిదినము లైనదని యడిగి గడువు దెలిసికొని కారణము తెలియక యాలోచించుచుండెను. చిరుతపులి వచ్చెనని యాగ్రా మము లన్నియుఁ బ్రచురమైనది. చాపలపని నేరుపుమని పెక్కండ్రువచ్చి సేవించు చుండిరి.

మరియొకనాఁ డొక కోయవాఁడు నలువుర రాజకింకరుల వెంటబెట్టుకొని యక్కడికివచ్చి వీఁడే చిరుతపులియను మృగదత్తుఁడు అని చూపి వారి యధీనము గావించెను

ఆరాజకింకరులు వానింజూచి ఔరా ! నీనిమిత్తమెన్ని దేశములు తిరిగితిమి.