పుట:కాశీమజిలీకథలు -07.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గదాధరుని కథ

203

గదాధరుఁడు - వినుండు. ఉశీనరపురంబున వీనితాత రత్నాకరుఁడు గలఁడు వానికివీనింజూపి తీసికొని పోవుఁడు ఇదియే నాకోరిక అతండు కోటీశ్వరుండగుట మీకు మంచి పారితోషిక మీయఁబడునని ప్రార్థించెను.

ఆమాట వినినతోడనే వారి హృదయంబులు సంకల్ప శతంబులచేఁ బూరితంబు లగుట నామార్గంబుల నడిపింపందొడంగిరి. గదాధరునితో మంచిమాటలు సెప్పుచు గౌరవింపందొడంగిరి కతిపయప్రయాణంబుల నన్నగరంబునకుఁ జనిరి. సంకెళులుదీసి ప్రచ్ఛన్నముగా దాచి రత్నాకరుని యింటికి గుప్తముగాఁ దీసికొనిపోయిరి. గదాధరునిఁ జూచి రత్నాకరుఁడు తొందరపాటుతో మావారిజాడ యేమైనం దెలిసినదా? అని అడుగుటయు నించుక జనాంతికముగా విను మీతండు నీమనుమఁడు ఆయడవిలో జని యించెను. తల్లిదండ్రుల నెరుంగఁడు దైవికముగా దారిలో దారసిల్లెను. దుర్గానగరం బునకుఁ బోయితిమి విధివశంబునం బట్టువడితిమి పెద్దశిక్షకై కొంపోఁబడుచుంటిమి అని యా కథ యంతయుం జెప్పెను.

రత్నాకరుఁడు మనుమని గౌఁగలించుకొని దుఃఖింపదొడంగెను. రాజభటులు అయ్యా ! చూచితిరిగదా ఇఁక పోవలయును. లెండు లెండని తొందర పెట్టుటయు గదా ధరుఁడు రత్నాకరునితో నేకాంతమాడి వారితో నిట్లనియె.

భటులారా ! మీవేతనము కడు స్వల్పములు అధికారము పెద్దది దండనవిధి అంతయు మీచేతిలో నున్నది దా మఱియు మాకొక యుపకారము మీరు జేయవలసి యున్నది. ఈధనము గైకొని అట్లు కావింపుఁడని పలుకుచు నేబదివేల దీనారముల వారి మ్రోలరాశిగాఁ బోయించెను. కనులకు మిఱిమిట్లు గొల్పుచున్న యాకనకరాశిం జూచి వాండ్రు విభ్రాంతిపడి యొక్కింత సేపేమియు మాటాడనేరక మిన్నకచూచు చుండిరి. గదాధరుండు మీరువీనిమూటగట్టుఁడు తరువాతఁ జేయదగిన కృత్యము బోధింతునని పలుకుటయు వాండ్రు దగ్గుత్తికతో స్వామీ ! మీయనుగ్రహమునకు సంత సించితిమి. మాశిరంబులు నిలుచునట్లుచేయుఁడు? మీరేమిచెప్పిన నట్లు నడుచువారమని పలికిన వని గదాధరుఁ డిట్లనియె.

మీకేమియు భయమురాదు. అపాయములేని యుపాయం బెఱింగించెద. వినుండు. మామువ్వురనిందు విడువుఁడు. మాకుమారుగా మీకు మరియొకరిని మువ్వురనప్పగించెదము, మాపేరులే చెప్పగలరు. దీన మీకేమియుఁ గొరతయుండదు. అక్కడివారలు మమ్ముఁజూచిన వారు కారుగదా? మీపత్రికలలోఁ బేరులే వ్రాయఁబడి యున్నవి. వానిం జదివికొని వారికే శిక్షవిధింతురు. వారికినిఁ దగిన యుపాధుల మే మేరుపరుతుమని చెప్పినవిని వాండ్రు ఆలోచించుకొని యందుఁదమ కేమియుఁ బ్రమా దములేదని నిశ్చయించుకొని యప్పని కంగీకరించిరి.