పుట:కాశీమజిలీకథలు -07.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26]

గదాధరుని కథ

201

దెలియదని యుత్తరము జెప్పెను. వీరపురుషులు వారిం బట్టుకొని రాజసభకుఁ దీసికొనిపోయిరి. రాజప్రతినిధి వారిని విడదీసి మీరెవ్వరు? వీరింటి కేమిటికి వచ్చితిరని యడిగిన గదాధరుఁ డొకరీతిని మృగదత్తు డొకరీతిం జెప్పిరి.

అంతకుమున్ను కుముదాంగదుని మేడలో నతడెరుంగకుండ ధ్వనిగ్రాహిణి యను యంత్రము నొకదాని నమర్చియుంచిరి. ప్రతినిధి యప్పుడా యంత్రమును దెప్పించి పరీక్షించెను.

చాలభాగము మృగదత్తుఁడు చెప్పినమాటలు గదాధరుఁ డాడిన మాటలు నాయంత్ర మాకర్షించినది. అభిముఖముగాక విముఖముగాఁ జెప్పినమాటలు గొన్ని దానిలోఁ జేరలేదు. వారిసంవాదమంతయు నవి యాకర్షించినచో వారు నిరపరాధులని తెల్లమేయగును వారికిఁ బ్రతికూలమైన మాటలే యందుఁ జేరినవి. విధిప్రేరితము కడు విచిత్రముగదా ? మృగదత్తుఁడు గురుదత్తుని కొడ కైనట్లును గదాధరుఁడు మిత్రుఁడై నట్లును అతం డడవులలోఁ గాపురముండి వీరిక్కడి కనుపుచున్నట్లు తెలిసికొని రాజప్రతినిధి వారినెల్ల నపరాధులుగానెంచి బద్దులంజేసి చెరసాల బెట్టించెను.

మఱియొకనాఁడు సామంతచక్రవర్తియగు గజేంద్రవాహుని కొత్త శాసన ప్రకారము వారికి స్థిరమగు దండన విధించుటకుఁ దన కధికారము లేమింజేసి వారి మువ్వురను రక్షకభటులతోఁ గూడ గజేంద్రవాహునియొద్ద కనిపెను.


సీ. ధన నిమిత్తమున కాదా ? మేదినీపతుల్‌
            బ్రభువులై ప్రజలఁ గాపాడుటెల్ల
    ధనముపార్జింపఁగాదా విప్రులఖిల వి
            ద్యాసంగ్రహస్పూర్తిఁ దనరుటెల్ల
    ధనము గూర్చుటకె కాదా ? బేరులూరఁ
            దిఱిగి వ్యాపారముల్‌ దిద్దుటెల్ల
    ధనలాభమునకె కాదా ? పాదభవులు క్షే
            త్రాజీవులై భూమి బ్రబలుటెల్ల

గీ. ధనముగోరనివారలీ ధరణిలేరు
   దైవమినకైనఁ గావలె ధనము ధనము
   వలనమెచ్చుచు దైవంబు వరములిచ్చు
   ధనమఖిలలోకలోక మోహనముసూవె

క. దైవంబునకే ధనమనఁ
   గాఁ వేడుక బొడముచుండగా దారుణమో