పుట:కాశీమజిలీకథలు -07.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

కాశీమజిలీకథలు - సప్తమభాగము

బడియెను. పద్మిని వీనింగనుటయేకాని ముద్దు ముచ్చటలు చూచి యెఱుంగదు. వారు మడిసిరని వార్త వ్యాపించినది. కాని యది అసత్యము దేశములపాలై తిరగుచున్నారు. రాజపురుష భయంబున వెల్లడికాకున్నారని తానెఱిఁగిన వృత్తాంతమంతయుంజెప్పి వారికి సంభ్రమము గలుగఁజేసెను.

అప్పుడు కుముదాంగదుఁడు వాని తెఱంగు భార్య కెఱిగించి కౌఁగలించు కొనుచు నానందబాష్పములచే వాని శిరంబు దడిపెను. అతని భార్యయుఁ గూఁతు చిహ్నములు వాని యందుండుట దిలకించి శోకింపఁ దొడంగినది.

తాను కొండపల్లిలో నుండుటయుఁ గోయపల్లెలో అల్లినచాపల జూచి తానంత కన్నఁ జిత్రముగా నల్లుటయుఁ నుదయార్కుని నగరమున కరుగుటయ నొక వేశ్య యింటి కరుగుటయు అందుఁగల యొక లేడియ బుద్దులు గరపుటయుఁ జీటి వ్రాసి యిచ్చుటయు రాజునొద్దకు బోవుటయు రత్నాంగి తనపై నేరమారోపించుటయు లోనగు వృత్తాంతమంతయుఁ గ్రమ్మర వక్కాణించి యామె యిచ్చిన చీటి కుము దాంగదునికి జూపెను.

ఆకమ్మ జదివికొని లిపి గురుతుపట్టి అయ్యో నాయనా! అదియే నీతల్లి. వేశ్య యింటిలో నేమిటికుండవలయును. ఏమన్నది బాబూ చెప్పము. చెప్పుము. అని మఱియుమఱియు అడుగుటయునతఁడిట్ల నియె.

అయ్యా ! ఆమె అలంకరించుకొనక యొకగదిలోఁ దలుపుమూల నిలువంబడి యున్నది. ఆమెంజూచి నీ వెవ్వతెవు ప్రొద్దున్న నాతో మాటాడిన బోగముది యేదీ? అని యడిగితిని. అది యిప్పుడే వచ్చును. నీవెవ్వఁడవు అని యడిగిన నేను నా వృత్తాంతము జెప్పితిని. అప్పుడు గోలుగోలున నేడ్చుటయు నేను శంకింప నీవు చిన్న వాఁడవై దుర్వృత్తిలోఁ బ్రవేశించినందులకు దుఃఖించితినని చెప్పినది. అప్పా ? అప్పుడు నాకామె‌ చెప్పిన నీతులకు మేరలేదు. మేనంతయు నాకు నీరు గ్రమ్మినది. ఈలాటి పను లెన్నఁడును జేయవలదని బోధించుచు నీ యుత్తరము వ్రాసి యిచ్చినది.

అప్పటికి నాఁకు జదువురాదు. ఏమి వ్రాసినదో తెలియదు. పిమ్మటఁ జదివి కొని యా యుత్తరము తెలిసికొని యిందు వచ్చుచుండ దారిలో గదాధరుఁడు గనం బడెను.

ఇరువురమువచ్చితిమని యాకథయే పదిసారులు చెప్పెను. ఎన్నిసారులుచెప్పినను తనవిసనకమరలమరలనడుగుచుంద్రు. వారట్లుమాటలాడుకొనుచుండరాజపురుషులుకొం దరులోపలికివచ్చి ఈ కొ త్తవారెవ్వరు? గురుదత్తునిచేఁబంపఁబడిరని యనుమానము గలిగి యున్నది. నిజము చెప్పమని యడిగిన గుముదాంగదుఁ డడలుచు వారెవ్వరో నాకుఁ