పుట:కాశీమజిలీకథలు -07.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గదాధరుని కథ

199

విరక్తితో వ్రాసినదని తలంచెదను అక్కటడికిఁబోయి చూతమా? అని యాలోచించి బాలుఁడా ! ఆమె యిప్పుడెందున్నదని అడిగిన నెక్కడికో పోయినది. అందులేదని యాబాలుం డుత్తరము జెప్పెను.

మృగదత్తుఁడు రహస్యముగా గదాధరునివలనఁ దనతలితండ్రుల వృత్తాంతము సాంతముగాఁ దెలిసికొని పరితపించుచు దుర్గానగరంబునకుఁ బోవుటకు సహాయము రమ్మని కోరికొనుచు.


గీ. సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
   గౌరవ మొసంగు జనులకుఁ గలుషమణచు
   గీర్తిబ్రకటించు ధైర్య విస్పూర్తిజేయు
   సాధుసంగంబు సకలార్థసాథకంబు.

అనిస్తుతియించుటయు నతఁడక్కడి అధికారుల శాసనము కడుక్రూరముగా నున్నది. మీవారియింటికిఁ జుట్టునుగాపు పెట్టిరి. క్రొత్తవారువచ్చిన బరీక్షించుచుందురు. వారినెచ్చటికిఁ బరీక్షింపపోవనీయరు. నీవృత్తాంతము దెలిసినఁ బట్టికొనియెద రేమో మీపితామహుని యూరికేగుదమన్నను వారనినట్లే నిర్భంధించుచున్నారు. కావునఁ బ్రచ్ఛన్నముగా బోయిచూడవలయునని గదాధరుఁడుపలుకుటయు మృగదత్తుండి ట్ల నియె.

మనమేమి అపరాధము జేసితిమి? నిరపరాధుల రాజపురుషులు బట్టికొని యెదరా? మఱియు రాజు చేసిన అక్రమమును నిందింపక మావారి నపరాధులుగా నెన్నుట తప్పుగాదా? ఎట్లయినను దుర్గానగరమున కరుగక తప్పదు. ఈయుత్తరము చూపవలయునని పలికెను.

వారట్లు మాట్లాడికొనుచుండఁగాఁ బ్రచ్ఛన్నముగాఁ దిరుగుచున్న యొక పురుషుఁడు వారిమాట లించుక యించుకవిని వారి వెనువెంట దిరుగుచుండెను.

వారుగూఢముగారామాదుర్గనగరమునకుంబోయిరి. కావలివారి నెట్లో తప్పించు కొని యిరువురు గుముదాంగదుని యింటిలోని కరిగిరి. గదాధరుని గురుతుపట్టి కుముదాంగదుఁడు నమస్కరించుచు భూసురోత్తమా? మావారి జాడ యేమైనం దెలి సినదియా? అయ్యో మేమిక్కడ బద్దప్రాయులమై యుంటిమి. యీబాలుఁడెవ్వఁడు యుశీనర నగరంబున కేమైన వార్తలు తెలియవుగదా యని కన్నీరు గార్చుచు అడిగిన అతండిట్లయె.

శెట్టీ ! చలపట్టి విధి మనలరట్టు వేయుచున్నాడు కీడులోమేలు విను మీ బాలుండు పద్మిని కొడుకు వీనిపేరు మృగదత్తుఁడు దైవికముగాఁ వీఁడు నాకన్నులఁ